Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఛీ.. యాక్‌! ఇళ్లు తుడిచే కర్రతోనా..’ BBQ చికెన్ తయారీ విధానం చూసి దడుచుకుంటున్న నెటిజన్లు..

రోడ్ల పక్కన స్టాల్స్‌ అందరికీ కనిపించేలా ఉంటాయి కాబటి.. ఏదో ఆచితూచి వంటలు చేస్తారుగానీ.. పెద్ద పెద్ద ఫైవ్‌ స్టార్ హోటల్స్‌లో లోపల ఎక్కడో వంట గదులు ఉంటాయి. అక్కడ ఏం వండుతున్నారు? ఎలా వండుతున్నారు? అనే విషయాలు బయట ఆకలితో నకనకలాడే కస్టమర్లకు తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ చూశారో.. వాడి ఆకలి సంగతి అటుంచితే..మరోసారి ఆ వైపుకు కూడా రాడు. మీరిప్పటి వరకూ రోడ్లు ఊడ్చే చీపుర్లతో దోసెలు, బ్లాక్‌ బోర్డ్‌ తుడిచే..

Viral Video: 'ఛీ.. యాక్‌! ఇళ్లు తుడిచే కర్రతోనా..' BBQ చికెన్ తయారీ విధానం చూసి దడుచుకుంటున్న నెటిజన్లు..
Mop Basting In BBQ
Srilakshmi C
|

Updated on: May 13, 2024 | 11:59 AM

Share

రోడ్ల పక్కన స్టాల్స్‌ అందరికీ కనిపించేలా ఉంటాయి కాబటి.. ఏదో ఆచితూచి వంటలు చేస్తారుగానీ.. పెద్ద పెద్ద ఫైవ్‌ స్టార్ హోటల్స్‌లో లోపల ఎక్కడో వంట గదులు ఉంటాయి. అక్కడ ఏం వండుతున్నారు? ఎలా వండుతున్నారు? అనే విషయాలు బయట ఆకలితో నకనకలాడే కస్టమర్లకు తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ చూశారో.. వాడి ఆకలి సంగతి అటుంచితే..మరోసారి ఆ వైపుకు కూడా రాడు. మీరిప్పటి వరకూ రోడ్లు ఊడ్చే చీపుర్లతో దోసెలు, బ్లాక్‌ బోర్డ్‌ తుడిచే డస్టర్లతో ఆమ్లెట్లు, బియ్యం బస్తా సంచులతో ఇడ్లీలు వండిన హోటళ్లను చూసి ఉంటారు (అదేనండీ.. ఏదో ఒక వీడియోలో చూసి గుడ్లు తేలేసి ఉంటారు కదా). తాజాగా అలాంటి మరో షాకింగ్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇళ్లల్లో ఫ్లోర్‌ తుడిచే మహిళను కొత్తగా పనిలో పెట్టుకుని ఉంటారు. వంటల్లో తన పనితనమంతా చూపించింది.. మాటలు కాదుగానీ ఈ వీడియో మీరే చూడండి!

BBQ నాన్ వెజ్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ ఉంది. ప్రపంచ నలుమూలల నుంచి ఆహార ప్రియులు ఈ కంపెనీ రుచులను ఆస్వాధిస్తుంటారు. ఈ కంపెనీ వంటకాలు అంత రుచిగా ఉండటానికి BBQ టెక్నిక్ ఎంటో తెలియక అవస్థలు పడినవారూ లేకపోలేదు. తాజాగా బీబీక్యూలోని వంటశాలలో వంటకాలు తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. BBQ చెఫ్‌ మాట్‌ కూపర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేశారు. భారీ పెనంపై ఉంచిన

ఇవి కూడా చదవండి

మాంసానికి సాస్‌ పూసేందుకు ఓ మహిళ మాప్‌ కర్రను వినియోగించడం వీడియోలో చూడొచ్చు. పైగా ఇలాంటి భారీ వంటకాల హైజీన్‌ కోసం సురక్షితమైన మాప్‌ కర్రను వినియోగిస్తున్నాం అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చి.. తమ చర్యను సమర్ధించుకున్నారు.

ఇక ఈ వీడియోకు ఇప్పటిక వరకు 48 మిలియన్ల వీక్షణలు, లక్షల్లో కామెంట్లు, లైకులు రావడంతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో దుమారం లేపింది. ఛీ.. యాక్‌! మేము ఇన్నాళ్లు ఇలాంటి అసహ్యకరమైన వంటలు తిన్నామా అంటూ షాక్‌ అవుతున్నారు. మరొకరు ‘దక్షిణాదికి చెందిన వారికి మాత్రమే ఈ టెక్నిక్‌ అర్ధం అవుతుంది. ఇది సాంప్రదాయేతర పద్ధతి. ప్రాంతీయ సాంకేతికత’ అంటూ పాత అనుభవాలున్న ఓ యూజర్‌ తోటి నెటిజన్లకు ధైర్యం చెప్పసాగాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.