AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Care: ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. నిపుణుల ముఖ్య సూచనలు

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత భీతిగొల్పుతోంది. విపరీతమైన వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే, ఈ సీజన్‌లో హీట్ షాక్, డీహైడ్రేషన్ కేసులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వేసవిలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారిలో ప్రారంభ నెలల్లో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇది సహజంగానే శరీరంలో నీటి కొరతకు దారితీస్తుంది..

Pregnancy Care: ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.. నిపుణుల ముఖ్య సూచనలు
Pregnancy Care
Srilakshmi C
|

Updated on: May 13, 2024 | 12:20 PM

Share

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత భీతిగొల్పుతోంది. విపరీతమైన వేడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే, ఈ సీజన్‌లో హీట్ షాక్, డీహైడ్రేషన్ కేసులు కూడా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వేసవిలో గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే వారిలో ప్రారంభ నెలల్లో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇది సహజంగానే శరీరంలో నీటి కొరతకు దారితీస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి ఫలితంగా గర్భిణీ మహిళల ఆరోగ్యం మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. ఇది నేరుగా కడుపులోని శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ సీజన్‌లో తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గైనకాలజిస్ట్ డా. సలోని చద్దా ఏం చెబుతున్నారంటే.. వేసవిలో గర్భిణీ స్త్రీలు పుష్కలంగా నీరు తాగాలి. దానితో పాటు తాజా పండ్ల రసాలు తాగడం కూడా శరీరానికి మేలు చేస్తుంది. పెరుగు, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. గర్భిణులు వీలైనంత వరకు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లక పోవడం మంచిది. వీటన్నింటితో పాటు గర్భిణీ స్త్రీలు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు మీకోసం..

గర్భధారణ సమయంలో బట్టల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సౌకర్యవంతమైన బట్టలు ధరించాలి. ఈ సీజన్‌లో కాటన్, నార బట్టలు ఉత్తమం. తెలుపు, నారింజ, నిమ్మ, నీలం లేదా లేత రంగు దుస్తులు ధరించాలి. దీనితో పాటు మహిళలు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వోట్మీట్‌ గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆరోగ్యకరమైన, పోషకాహారం. ఇందులో పీచు, ప్రొటీన్, మినరల్స్ పుష్కలంగా ఉండి శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిలగడదుంపలు తప్పక తినాలి. ఇందులో విటమిన్ ఎ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి పచ్చ కూరగాయలు చాలా మేలు చేస్తాయి. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఎక్కువ సేపు నిశ్చలంగా నిలబడటం అంత మంచిది కాదు. సౌకర్యవంతమైన బూట్లు లేదా చెప్పులు ధరించకూడదు. వైద్యుల సూచన మేరకు రోజూ కొద్దిసేపు నడవడం ప్రాక్టీస్‌ చేయాలి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు బయటికి వెళ్లడం మానుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.