Aloo Bukhara Jam: ఆలూ బుఖారా జామ్ ఇంట్లోనే ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
వర్షాకాలం వచ్చిందంటే ఆలూ బుఖారా సీజన్ వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్క చూసినా కుప్పలు కుప్పలుగా ఇవే కనిపిస్తాయి. అందులోనూ సీజన్ ఫ్రూట్ కాబట్టి ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలు, ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఇవి తియ్యగా, పుల్లగా ఉంటాయి. తినేకొద్దీ తినాలని అనిపిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా..
వర్షాకాలం వచ్చిందంటే ఆలూ బుఖారా సీజన్ వచ్చేస్తుంది. ఈ సీజన్‌లో ఎక్క చూసినా కుప్పలు కుప్పలుగా ఇవే కనిపిస్తాయి. అందులోనూ సీజన్ ఫ్రూట్ కాబట్టి ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సీజనల్‌గా దొరికే పండ్లు, కూరగాయలు, ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలా తినడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. ఇవి తియ్యగా, పుల్లగా ఉంటాయి. తినేకొద్దీ తినాలని అనిపిస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభిస్తాయి. వీటితో మనం జామ్ కూడా తయారు చేసి పిల్లలకు ఇవ్వొచ్చు. మరి ఈ ఆలూ బుఖారా జామ్ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ బుఖారా జామ్‌కి కావాల్సిన పదార్థాలు:
ఆలూ బుఖారాలు, పచ్చి మామిడి కాయ, పంచదార, అల్లం తురుము, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, జీలకర్ర, లవంగాలు, ఎండు ద్రాక్ష, ఆయిల్.
ఆలూ బుఖారా జామ్ తయారీ విధానం:
ముందుగా ఆలూ బుఖారాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చి మామిడి తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆ తర్వాత జీలకర్ర, లవంగాలు, అల్లం తురుము వేసుకోవాలి. ఇవి వేగాక ఆలూ బుఖారా ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, పంచదార వేసుకుని మొత్తం ఒకసారి కలపాలి. కొద్దిగా వాటర్ కూడా వేసి మగ్గనివ్వాలి. సన్న మంట మీద మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి.
ముక్కలు బాగా మెత్తబడ్డాక, గరిటెతో నొక్కుతూ మెత్తగా చేయాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్షకూడా వేయాలి. మరో పది నిమిషాలు చిన్న మంట మీదనే మగ్గనివ్వాలి. కాసేపటికి ఇది మొత్తం జామ్‌లాగా తయారవుతుంది. ఇలాంటి సమయంలో తీసి ఓ గిన్నెలో వేసుకోవాలి. చల్లారాక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ జామ్ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని మీరు చపాతీలు, బ్రెడ్ మీద రాసుకుని తినవచ్చు.