AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Milk: నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..? ఇందులో కొవ్వు శాతం జీరో..!

పిల్లలతో పాటు పెద్దలు, మహిళలు కూడా పాలు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ, పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా..? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు.

Black Milk: నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..? ఇందులో కొవ్వు శాతం జీరో..!
Black Milk
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2024 | 10:05 AM

Share

మనందరి ఇళ్లల్లో పాల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. ఆవుపాలు, గేదె పాలను ప్రత్యేకంగా ఇంటి అవసరాలు కాఫీ,టీ, పెరుగు కోసం పాలను వాడుతుంటారు. పిల్లలు, పెద్దలు రోజూ పాలుతాగుతుంటారు. కొందరు మేక పాలను కూడా వాడుతారు. అయితే, ఈ పాలన్నీ తెల్లగా స్వచ్ఛగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. కానీ, ఒక జంతువు పాలు నల్లగా ఉంటాయని మీకు తెలుసా..? అవును, చాలా జంతువుల పాలు తెల్లగా ఉంటాయి, కానీ, పాలు నల్లగా ఉండే జంతువు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారపు అలవాట్లు ఎంత ముఖ్యమో. అదే విధంగా పిల్లల పోషణకు పాలు అత్యంత ముఖ్యమైనవి. దాదాపు పిల్లలందరికీ ఎక్కువగా తల్లిపాలనే పడుతుంటారు. కానీ, కొందరు పిల్లలకు ఆవుపాలు, గేదె పాలు తాగిస్తుంటారు. పిల్లలతో పాటు పెద్దలు, మహిళలు కూడా పాలు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ, పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా నలుపు రంగు పాలను చూశారా..? బహుశ మీరు ఇలాంటివి చూసి ఉండకపోవచ్చు.

చాలా తక్కువ మంది మాత్రమే నల్ల పాలను చూసి ఉంటారు. అయితే, ఇలాంటి నలుపు రంగు పాలు ఆడ నల్ల ఖడ్గమృగం నుండి వస్తాయి. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గమృగం అని కూడా అంటారు. ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లనిరంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటారు. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతారు. ఖడ్గమృగం తల్లి పాలలో నీరు ఉంటుంది. 0.2 శాతం కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ నల్లని పాలు జంతువుల్లో పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే నల్ల ఖడ్గమృగాలు నాలుగు నుండి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇది కాకుండా, వాటి గర్భం సాధారణం కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ పాటు గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా