Black Turmeric Benefits : నల్ల పసుపు గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇలా వాడితే ప్రయోజనాలు బోలెడు..!
Black Turmeric Benefits : ఇప్పటి వరకు పసుపు అనగానే పచ్చటి రంగులో ఉంటుందని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ, పసుపు కేవలం పసుపు రంగులోనే కాదు.. నలుపు రంగులో కూడా ఉంటుంది. దీనినే నల్ల పసుపు అంటారు. సాధారణ పుసుపులో కంటే..నల్ల పసుపులో ఔషద గుణాలు మరింత ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నల్లపసుపు సాధారణ పసుపులాగా దుంపల రూపంలోనే ఉంటుంది. దీంట్లో కర్కుమిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కర్కుమిన్ గొప్ప యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.
Updated on: Jul 23, 2024 | 9:23 AM

నల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తుంది. వృద్దాప్యాన్ని మందగింపజేయడానికి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది.

నల్ల పసుపు తీసుకుంటే శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నల్లపసుపులో ఉండే కర్కుమిన్ లక్షణం క్యాన్సర్ కణాలతో పోరాడటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్ లలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

సాధారణంగా చాలా మంది మహిళలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి వేధిస్తుంటుంది. అలాంటి వారికి నల్లపసుపు మేలు చేస్తుంది. నల్ల పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మహిళల్లో వచ్చే నెలసరి నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం నల్ల పసుపు పొడిని వేడి పాలలో కలుపుకుని తాగటం మంచిది. నల్ల పసుపు గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్లు, అజీర్ణం, అల్సర్లు గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటి సమస్యలు దరిచేరవు. మీ ఆహారంలో కొంత నల్ల పసుపు వేసుకుని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

నల్లపసుపులో ఉండే ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా. మీరు సాధారణ పసుపులానే దీనిని ఉపయోగించవచ్చు.

ఈ మధ్య కాలంలో చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇందులో తల వెనుక భాగంలో, పక్క భాగంలో భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందడానికి నల్ల పసుపు సహాయపడుతుంది. తాజా, నల్ల పసుపు చూర్ణంలా చేసి, నుదుటిపై పేస్ట్‌లాగా అప్లై చేయటం వల్ల నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.




