2030 నాటికి భారతీయులు తమ వంట గదులకు తాళాలేస్తారా? మూడు పూట్లా హోటళ్లలోనే తింటారా?
తాజాగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా NRAI ఓ నివేదికను విడుదల చేసింది. అది రెస్టారెంట్స్ అసోసియేషన్ కనుక.. కేవలం రెస్టారెంట్లకు సంబంధించిన వివరాలు మాత్రమే అందించింది. ఆ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న మొత్తం రెస్టారెంట్ల సంఖ్య అక్షరాల 74వేల 807. ఇందులో వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేసినవి 41వేల144. ఇవి కాకుండా నగరంలో 16వేల 379 క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి. వీటితో పాటు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు 13 వేల 544, అలాగే క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు మరో 6వేల468 ఉన్నాయి.

2023లో ప్రతి సెకెన్‌కి సుమారు 2 నుంచి 3 బిర్యానీలు ఇండియా ఆర్డర్ చేసిందంటూ స్వీగ్గీ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అది చూసిన తర్వాత.. అబ్బో ఇండియాలో బిర్యానీ ప్రియులు బాగానే ఉన్నారనుకున్నాం. అయినా దేశ వ్యాప్తంగా ఏటా బిర్యానీ మార్కెట్ దాదాపు 20 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఉంటుందన్న వార్తలొచ్చినప్పుడు సెకెన్‌కి 2 నుంచి 3 బిర్యానీలు ఆర్డర్ చెయ్యడం సర్వ సాధారణం. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా లేదు. ఇది మరో వార్త.. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ మార్కెట్ ఏకంగా 45శాతం పెరిగిందట. ఇక మరో ఆన్ లైన్ ఫుడ్ దిగ్గజం జొమాటో విషయానికి వస్తే 2024 తొలి త్రైమాసికంలో ఏకంగా 175 కోట్ల లాభం కళ్ల జూసింది. స్విగ్గీ-జొమాటో.. రెండూ ఇండియాలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెబుతా… 2030 నాటికి ఈ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ విలువ ఏకంగా 2లక్షల కోట్లకు చేరుతుందట. ఇది తాజాగా బెయిన్ మరియు స్విగ్గీ సంస్థలు వెల్లడించిన రిపోర్ట్. పైన చెప్పిన మూడు విషయాలను బట్టీ మనకు ఏం అర్థమవుతోంది..? ఇండియన్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్… భవిష్యత్ అద్భుతంగా ఉండబోతోందనా…? వాళ్లు అవకాశం ఇస్తే… మనం కూడా వీలైతే అందులో పెట్టుబడులు పెడితే.. కళ్లు చెదిరే లాభాలు చూరగొనచ్చనా..? లేదా.. భారతీయులు వంట చెయ్యడం మానేసి…...