Royyala Iguru: హోటల్ స్టైల్ లో రొయ్యల ఇగురు ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ లాగించేస్తారు!
రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇక నాన్ వెజ్ ప్రియులకు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేస్తారు. స్నాక్స్, ఫ్రై, ఇగురు ఇలా ఎన్నో రకాలు తయారు చేస్తారు. హోటల్స్ కి వెళ్లిన వారు చాలా మంది రొయ్యల ఇగురును ఆర్డర్ చేస్తూ ఉంటారు. అదే టేస్ట్ ని ఇంట్లో కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎలాంటి ఘాటు మసాలాలు వాడకుండా.. అది కూడా సింపుల్ గా ఈ రొయ్యల ఇగురు..
రొయ్యలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇక నాన్ వెజ్ ప్రియులకు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేస్తారు. స్నాక్స్, ఫ్రై, ఇగురు ఇలా ఎన్నో రకాలు తయారు చేస్తారు. హోటల్స్ కి వెళ్లిన వారు చాలా మంది రొయ్యల ఇగురును ఆర్డర్ చేస్తూ ఉంటారు. అదే టేస్ట్ ని ఇంట్లో కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎలాంటి ఘాటు మసాలాలు వాడకుండా.. అది కూడా సింపుల్ గా ఈ రొయ్యల ఇగురు తయారు చేసుకోవచ్చు. మరి ఈ రొయ్యల ఇగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల ఇగురుకు కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, కరివే పాకు, కొత్తి మీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, గరం మసాలా, ధనియాలు, మిరియాలు, జీల కర్ర, టమాటాలు.
రొయ్యల ఇగురు తయారీ విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ధనియాలు, జీల కర్ర, వేసి కచ్చా పచ్చాగా పట్టాలి. ఆ తర్వాత అదే జార్ లో టమాటాలు, కొత్తి మీర కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు వేసి వేయించు కోవాలి. ఇవి కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసి.. ఒక నిమిషం పాటు వేగాక.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి ఎర్రగా వచ్చేంత వరకూ వేయించు కోవాలి.
ఇవి వేగాక మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపు కోవాలి. ఈ మిశ్రమం కూడా బాగా వేగాక.. శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్య వేసి మూత పెట్టి ఓ ఐదు నిమిషాలు వేయించు కోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి.. నీరంతా ఇగురు పోయేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా గరం మసాలా, కొత్తి మీర వేసి కలుపుకుని మరో నిమిషం ఉడికిస్తే సరి పోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్స్ స్టైల్ రొయ్యల ఇగురు సిద్ధం. మరింకెందుకు లేట్ మీరు కూడా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ట్రై చేయండి.