అల్లంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? ఈ తప్పు చేస్తే మాత్రం డేంజర్!
శీతాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా జబ్బుల బారినపడుతుంటారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జీర్ణ సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అల్లం తీసుకుంటే ఎంతో మంచిది.

శీతాకాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తొందరగా జబ్బుల బారినపడుతుంటారు. శీతాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల జీర్ణ సమస్యలు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా అల్లం తీసుకుంటే మంచిది.
అల్లంతో ప్రయోజనాలు
అల్లంను టీలో మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలకు కూడా జోడించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అల్లం శీతాకాలంలో వచ్చే జీర్ణ సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేగాక, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధి బాధితులకు ఇదొక వరమనే చెప్పాలి. అయితే, డయాబెటిస్ ఉన్న వ్యక్తులు అల్లంను మితంగా తీసుకోవాలి. రోజుకు 5 గ్రాములు తీసుకుంటే చాలు. రక్తంలో చక్కరను నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
ఇక అల్లంలో ఉండే యాంటీఅక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉండటంతో మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. వృద్ధులు తగినంత అల్లం తీసుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది. శరీర నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి వృద్ధులకు ఉపశమనం కలిగిస్తుంది. అల్లం కలిపిన మిశ్రమాలు తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతం అవుతుంది. వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
అల్లం అధికం తీసుకుంటే మాత్రం..
అల్లం శరీరానికి అవసరమైనంత తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే, అవసరానికి మించి తీసుకుంటే మాత్రం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అల్లం ఎక్కువ తీసుకుంటే విరేచనాలు, గుండెలో మంటకు కారణమవుతుంది. అందుకే తగినంత అల్లం తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు.