Green Garlic: ఉల్లి కాడలే కాదు.. వెల్లుల్లి కాడలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయ్..
చలికాలం వస్తే పాలకూర, ఆవాలు, మెంతులు మొదలైన ఆకు కూరలు మార్కెట్లో దర్శనమిస్తాయి. వీటితో పాటు మార్కెట్‌లో ఎక్కువగా కనిపించే కూరగాయల్లో వెల్లుల్లి కాడలు. వెల్లుల్లి కాడలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో పాటు, వెల్లుల్లి ఆకులలో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి..

చలికాలం వస్తే పాలకూర, ఆవాలు, మెంతులు మొదలైన ఆకు కూరలు మార్కెట్లో దర్శనమిస్తాయి. వీటితో పాటు మార్కెట్‌లో ఎక్కువగా కనిపించే కూరగాయల్లో వెల్లుల్లి కాడలు. వెల్లుల్లి కాడలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో పాటు, వెల్లుల్లి ఆకులలో విటమిన్ బి, విటమిన్ సి, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. శీతాకాలంలో వెల్లుల్లి కాడలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..
రోగనిరోధక శక్తి బూస్టర్
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వెల్లుల్లి కాడల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి కాడలు తినడం వల్ల చలికాలంలో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
వెల్లుల్లి కాడలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లి కాడలను తీసుకోవడం ద్వారా మలబద్ధకం, గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్తపోటును నియంత్రిస్తుంది
వెల్లుల్లి కాడల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. వెల్లుల్లి కాడలను తినడం వల్ల బరువు తగ్గవచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వెల్లుల్లి కాడల్లో క్యాలరీలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి కాడలను తినడం వల్ల ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా మీ ఆకలిని అరికట్టవచ్చు.
కీళ్లకు ఆరోగ్యానికి మంచిది
వెల్లుల్లి ఆకుల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి మోకాళ్ల నొప్పుల నుంచి తర్విత గతిన ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.