AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back Pain: మహిళల్లో వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? త్వరితగతిన ఉపశమనం పొందాలంటే..

నలభై ఏళ్ల తర్వాత చాలా మంది మహిళలు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. నిరంతర వెన్నునొప్పి వేధిస్తుంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు వయస్సు పైబడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంటుంది. సాధారణంగా 40 ఏళ్ల వయస్సులో మహిళలు వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు..

Back Pain: మహిళల్లో వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? త్వరితగతిన ఉపశమనం పొందాలంటే..
Back Pain
Srilakshmi C
|

Updated on: Dec 14, 2023 | 7:23 PM

Share

నలభై ఏళ్ల తర్వాత చాలా మంది మహిళలు వెన్నునొప్పి సమస్యతో బాధపడుతుంటారు. నిరంతర వెన్నునొప్పి వేధిస్తుంటుంది. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు వయస్సు పైబడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంటుంది. సాధారణంగా 40 ఏళ్ల వయస్సులో మహిళలు వెన్నునొప్పి సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు వెన్నునొప్పితో బాధపడుతుంటారు. అసలు మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందంటే..

మహిళల్లో వెన్నునొప్పి కారణాలు ఇవి..

  • ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్
  • ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ (PMDD)
  • ఎండోమెట్రియోసిస్
  • డిస్మెనోరియా లేదా ఋతు నొప్పి
  • ఆలస్యమైన గర్భం
  • బోలు ఎముకల వ్యాధి
  • ఊబకాయం
  • మెనోపాజ్
  • జీవనశైలి
  • కండరాల ఒత్తిడి
  • సయాటికా
  • హెర్నియేటెడ్ డిస్క్
  • డిజెనరేటివ్ డిస్క్

వెన్నునొప్పి సమస్య నుండి ఉపశమనం పొందడం ఎలా?

మీరు 40 ఏళ్ల తర్వాత వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే, దాని నుండి ఉపశమనం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం…

రోజువారీ వ్యాయామం

వెన్నునొప్పి సమస్యను తగ్గించుకోవడానికి రోజూ చిన్న పాటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఏరోబిక్ ట్రైనింగ్‌, ఎనర్జీ ట్రైనింగ్‌, ఫ్లెక్సిబిలిటీ బ్యాలెన్స్ వంటి వ్యాయామాలు చేయడం ముఖ్యం. వారానికి కనీసం 3 నుంచి 5 సార్లు వ్యాయామం చేసే మహిళలకు వెన్నునొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వెచ్చని నీళ్లలో స్నానం చేయాలి

స్నానం చేసేటప్పుడు వేడి నీళ్లను ఉపయోగించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాల నొప్పి తగ్గుతుంది.

బరువు విషయంలో జాగ్రత్త వహించాలి

వెన్నునొప్పితో బాధపడేవారు బరువు తగ్గడం చాలా ముఖ్యం. బరువు పెరగడం వల్ల వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అధిక బరువుతో ఉంటే, వెంటనే బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

సీటింగ్ గమనించాలి

లేచి నిలబడినప్పుడు లేదా కూర్చున్నప్పుడు మీరు కుర్చున్న, నిలబడిన పొజిషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. ముఖ్యంగా మీరు ఎక్కువ గంటలు కుర్చీలో కూర్చుని పని చేస్తే, దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్‌లు వెన్నునొప్పి, బెణుకులు, వాపులను తగ్గిస్తాయి. దీన్ని అప్లై చేయడం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా