- Telugu News Photo Gallery Dates Soaked In Ghee: Everything You Need To Know About These Ayurvedic Tips
Dates Soaked In Ghee: నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తింటే.. పాత ఆయుర్వేద పద్ధతి! మీరూ ట్రై చేయండి
రోజువారీ ఆహారంలో ఖర్జూరాన్ని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి శక్తి బూస్టర్‌గా పనిచేస్తాయి..
Updated on: Dec 14, 2023 | 8:21 PM

రోజువారీ ఆహారంలో ఖర్జూరాన్ని తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అయితే ఆయుర్వేదం ప్రకారం ఖర్జూరాలను నెయ్యితో కలిపి తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీర కణాలను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి శక్తి బూస్టర్‌గా పనిచేస్తాయి. అంటే ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుంటే శరీరానికి కావల్సన శక్తి అందుతుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నెయ్యి కూడా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రెగ్యులర్‌గా మలబద్ధకం, ఇతర కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఖర్జూరంతో నెయ్యి తినవచ్చు.

ఖర్జూరం, నెయ్యి కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఖర్జూరంలో చక్కెరలు ఉంటాయి. కానీ నెయ్యితో కలిపి తినడం వల్ల ఖర్చూరంలోని ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణ ప్రక్రియను నెమ్మదింప చేస్తుంది. ఇది రక్తంలో త్వరగా చక్కెరను పెంచదు.

చలికాలంలో రుమటాయిడ్ సమస్య పెరుగుతుంది. చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కానీ ఖర్జూరం, నెయ్యి కలిపి తినడం వల్ల కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది కీళ్లలో చలనశీలతను పెంచడంలో సహాయపడుతుంది.

నెయ్యి, ఖర్జూరం రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి నెయ్యి, ఖర్జూరం చాలా మేలు చేస్తాయి. ఈ రెండు పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపాన్ని భర్తీ చేస్తుంది. ఇది రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మిశ్రమాన్ని గర్భధారణ సమయంలో, ప్రసవం తర్వాత కూడా తీసుకోవచ్చు.





























