- Telugu News Photo Gallery Technology photos Asus launhces new laptop n india Chromebook Plus CX34 features and price details
Asus: అసుస్ నుంచి మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
ప్రముఖ టెక్ దిగ్గజం అసుస్ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. క్రోమ్‌బుక్ ప్లస్ సీఎక్స్34 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు రిటైల్ స్టోర్స్‌లో క్రోమ్‌బుక్ ప్లస్ సీఎక్స్34ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ల్యాప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 14, 2023 | 8:40 PM

అసుస్ కంపెనీ భారత్‌లోకి కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. క్రోమ్‌బుక్ ప్లస్ సీఎక్స్ 34 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా జనవరి 31, 2024 లోపు ఈ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసే వారికి అసుస్ అడాబ్ ఫోటోషాప్ వెబ్ 3 నెలల ట్రయల్‌ని ఉచితంగా అందిస్తారు.

ఈ ల్యాప్‌టాప్‌ను 8జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 128 జీబీ, 245 జీబీ, 516 జీబీ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఈ ల్యాప్‌టాప్ బేస్ వేరియంట్ ధర రూ. 39,990గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.

ఇక ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 14 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌ను అందించాఉ. స్క్రీన్-టు-బాడీ రేషియో 80 శాతం కాగా, LED బ్యాక్‌లిట్ వంటి ఫీచర్‌ను అందించారు. ల్యాప్‌టాప్ తక్కువ బరువు, సన్నగా రూపొందించారు.

ఇక ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ 12వ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. కెమెరా కోసం 1080p ఫుల్‌హెచ్‌డీ సెన్సార్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే.. 50Wh 3-సెల్ లిథియం అయాన్ రీచార్జ్ చేయగల లిథియం పాలిమర్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటలు పనిచేస్తుంది.

ఇక ఈ ల్యాప్‌టాప్లో ప్రీలోడెడ్‌గా గూగుల్ ప్లేస్టోర్, అడాబ్ ఎక్స్‌ప్రెస్, అడోబ్ ఫొటోషాప్, గూగుల్ ఫొటోస్ ఏఐ బేస్డ్.. మ్యాజిక్ ఎరెజర్, హెచ్‌డీఆర్ వంటి ఫీచర్స్‌ను అందించారు. బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది.





























