Egg 65 Recipe: ఆదివారం స్పెషల్.. రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేసి చూడండి.. పిల్లలు ఇష్టంగా తింటారు..

ఎగ్ బజ్జి వంటి స్నాక్ ఐటెమ్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు.  అంతేకాదు ఎగ్ 65 స్నాక్ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ 65 సర్వసాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్, రెస్టారెంట్స్ లో మాత్రమే లభిస్తుంది. అందరూ ఇష్టంగా తినే ఈ ఎగ్ 65 ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Egg 65 Recipe: ఆదివారం స్పెషల్.. రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేసి చూడండి.. పిల్లలు ఇష్టంగా తింటారు..
Egg 65 Recipe
Follow us

|

Updated on: May 28, 2023 | 8:53 AM

సంపూర్ణ ఆహారం.. గుడ్డు. సర్వసాధారణంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్ట పడతారు. ప్రతి రోజూ తింటే ఆరోగ్యానికి మేలు అని పోషకార నిపుణులు చెబుతున్నారు.  గుడ్డుతో రకరకాల ఆహారపదార్ధాలు చేసుకోవచ్చు. గుడ్డతో కూరలు, బిర్యానీ వంటి ఆహారపదార్ధాలు మాత్రమే కాదు. ఎగ్ బజ్జి వంటి స్నాక్ ఐటెమ్స్ ను కూడా తయారు చేసుకోవచ్చు.  అంతేకాదు ఎగ్ 65 స్నాక్ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ 65 సర్వసాధారణంగా ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్స్, రెస్టారెంట్స్ లో మాత్రమే లభిస్తుంది. అందరూ ఇష్టంగా తినే ఈ ఎగ్ 65 ని ఇంట్లోనే టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఆదివారం స్పెషల్ గా స్నాక్ ఐటెం ఎగ్ 65 తయారీ విధానం గురించి తెలుసుకుందాం..

తయారీకి కావాల్సిన పదార్ధాలు: 

ఉడకబెట్టిన గుడ్లు- 5

ఇవి కూడా చదవండి

ఎగ్ వైట్ – గుడ్డు నుంచి తీసింది

అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీ స్పూన్

మిరియాల పొడి – అర టీ స్పున్

ఎర్ర కారం పొడి- ఒక టీ స్పూన్

పచ్చి మిర్చి – 2( కట్ చేసుకున్న ముక్కలు )

కరివేపాకు – 3 రెమ్మలు

జీడిపప్పు – 4

వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్మై

కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్

మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్

కొత్తిమీర తరుగు – కొంచెం

ధనియాల పొడి – ఒక టీ స్పూన్

నిమ్మ‌ర‌సం – కొంచెం

గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

రెడ్ చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్

నూనె – వేయించడానికి సరిపడా

టమాటో సాస్ – ఒక టేబుల్ స్పున్

ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు

ట‌మాట కచ‌ప్

తయారీ విధానం: ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. తర్వాత వాటిని కట్ చేసి.. పచ్చ సొన తీసి.. తెల్లని ముక్కలను ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మైదా పిండి, కార్న్ ప్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసుకుని తెల్ల గుడ్డు ముక్కలతో కలపాలి. తర్వాత ఒక గుడ్డు నుంచి తీసుకున్న ఎగ్ వైట్ ను వేసుకుని మిక్స్ చేయాలి.

వీటిని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల మిశ్రమాన్ని నూనెలో వేసుకుని వేయించాలి. మీడియం మంట మీద గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత వాటిని తీసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.

తర్వాత మళ్ళీ ఒక బాణలి పెట్టి.. ఒక టేబుల్ స్పున్ నూనె వేసుకోవాలి. వేడి ఎక్కిన తర్వాత అందులో వెల్లుల్లి తరుగు, కట్ చేసిన పచ్చి మిర్చి , కట్ చేసిన కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత రెడ్ సాస్, టమాటో సాస్ వేసి కలపాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి.. ఇందులో ముందుగా వేయించుకున్న ఎగ్ ముక్కలను వేసి జాగ్రత్తగా మిక్స్ చేయాలి. అంతే ఎగ్ 65 రెడీ.. ప్లేట్ లో తీసుకుని నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ తరుగు, టమాటా కెచప్, వేయించుకున్న జీడిపప్పు లతో కలిపి తింటే ఆహా ఏమి రుచి అంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ మారింది.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
గోధుమ చపాతీతో జీర్ణ సమస్యలా? చిరుధాన్యాలతో బలే రుచిగా రోటీలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
వచ్చే 4 రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు..
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 27 వేల ఫోన్‌ రూ. 19వేలకే.. వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
రూ. 9 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. వివో నుంచి కొత్త ఫోన్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
కాషాయం ఎక్కువైంది.. టీమిండియా ప్రపంచకప్ జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
వేసవిలో ఒంట్లో కొవ్వును వెన్నలా కరిగించే పండ్లు
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
చెడు కొలెస్ట్రాల్‌ను తరిమికొట్టాలా? ప్రతిరోజూ ఉదయం ఈ ఆకును నమలండి
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా