వెల్లుల్లికి వంటింటి ఔషధం అనే పేరు కూడా ఉంది. అయితే దీని ఘాటైన వాసన వల్ల చాలా మంది దీనిని తినేందుకు ఇష్టపడరు
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో వెల్లుల్లి తప్పక తీసుకోవాలి. వింటర్ షీల్డ్‌గా పేరుగాంచిన వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి
TV9 Telugu
చలికాలంలో ఊరికూరికే వచ్చే జలుబులూ, దగ్గులూ, జ్వరాలకు వెల్లుల్లి చెక్ పెడుతుంది. వాతావరణం చల్లబడగానే ముఖ్యంగా పిల్లలూ, వృద్ధులూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు
TV9 Telugu
శ్వాసకోశవ్యాధులు మొదలు గుండె జబ్బుల వరకూ దాడి చేసే ఈ కాలంలో రోగాల నుంచి తప్పిచుకోవడానికి వెల్లుల్లి తప్పక తీసుకోవాలి
TV9 Telugu
దీనిలో శక్తిమంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలెన్నో ఉన్నాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందట
TV9 Telugu
ఇది కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగాలను అడ్డుకునే ఇమ్యూనిటీని పెంచడంలో ఇందులోని అల్లిసిన్ అనే ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తుంది
TV9 Telugu
నిద్రలేమి సమస్యలు, కీళ్ల నొప్పుల నుంచి ఎన్నో రోగాలకు వెల్లుల్లి ఉపశమనం కలిగిస్తుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ లోపం వల్ల వచ్చే సమస్యల్నీ తగ్గిస్తుంది
TV9 Telugu
వెల్లుల్లి క్రమం తప్రకుండా తీసుకుంటే ఈ సమయంలో వచ్చే వేడి ఆవిర్లు, మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లకీ ఇది మంచిది. దీంతో శరీరంలో పేరుకున్న కొవ్వులు కరుగుతాయి