Roof Farming: ఇంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర సహా వీటిని పెంచుకోండి.. డబ్బు అదా, ఆరోగ్యానికి ఆరోగ్యం..

కొందరు నగరవాసులు మొక్కల పెంపకంపై ఆసక్తిని చూపిస్తున్నారు. తమ ఫ్లాట్లలో ఇళ్లలోపల కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను పండించుకోవచ్చు. డాబామీద మొక్కలు పెంచుకోవడంవలన సేంద్రియ, స్వచ్ఛమైన ఆహారం అందడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మీకు కూడా రూఫ్ గార్డెనెంగ్ మీద ఆసక్తి ఉంటె.. సాంకేతికతతో ఇంటి దగ్గర మసాలా దినుసులను పెంచుకోవచ్చు.

Roof Farming: ఇంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర సహా వీటిని పెంచుకోండి.. డబ్బు అదా, ఆరోగ్యానికి ఆరోగ్యం..
Roof Farming
Follow us

|

Updated on: May 28, 2023 | 10:09 AM

బతుకుపోరాటంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారు ప్రజలు. దీంతో నగరాలపై జనాభా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పట్టణాల్లో జీవనం ఖరీదుగా మారింది. అయితే ఎంత ఖర్చు పెట్టినా కల్తీ లేని ఆహారం అందడం కలలో అన్నట్లుగానే ఉంది. పాలు, పండ్లు, కూరగాయలు ఇలా  ఏదీ స్వచ్ఛమైన ఆహారంకాదంటూ పోషకాహార నిపుణువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే  పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి దినుసులు కూడా సేంద్రీయంగా లభించడం లేదు. వీటిని తిన్న ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోంది. అయితే కొందరు నగరవాసులు మొక్కల పెంపకంపై ఆసక్తిని చూపిస్తున్నారు. తమ ఫ్లాట్లలో ఇళ్లలోపల కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలను పండించుకోవచ్చు. డాబామీద మొక్కలు పెంచుకోవడంవలన సేంద్రియ, స్వచ్ఛమైన ఆహారం అందడంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మీకు కూడా రూఫ్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉంటె.. సాంకేతికతతో ఇంటి దగ్గర మసాలా దినుసులను పెంచుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..

పసుపు: పసుపు దినుసు. వంటింటి ఔషధం.. పసుపు లేని కూర ఉండదంటే అతిశయోక్తి లేదు. పసుపును ఏ రకమైన కూరగాయలలోనైనా ఉపయోగిస్తారు. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పసుపుని ఇంట్లో కూడా సాగు చేసుకోవచ్చు. మీరు ఇంటి పైకప్పుపై ఒక కుండీని తీసుకుని పసుపును విత్తుకోవచ్చు. పసుపుకు ప్రతిరోజూ 5 నుండి 6 గంటల వరకు సూర్యరశ్మి అవసరం. దీంతో పంట ఎదుగుదల బాగుంటుంది. విశేషమేమిటంటే వేసవి కాలంలో పసుపు సాగు చేయడం మంచిది. నాటిన 6 నుంచి 8 నెలల తర్వాత పసుపు పంట సిద్ధంగా ఉంటుంది.

కొత్తిమీర: మీరు ఇంటి లోపల కొత్తిమీర పండించవచ్చు. అయితే కొత్తిమీర పెంచుకోవడానికి  దీర్ఘచతురస్రాకార కుండీ అనుకూలం. ఎలాంటి వాతావరణంలోనైనా కొత్తిమీరను సాగు చేయవచ్చు. మీరు కుండీలో కొత్తిమీర విత్తనాలను నాటుకోవాలి. మీకు కావాలంటే ఆవు పేడను ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాదు మధ్యలో నీటిని పోయాల్సి ఉంటుంది. ఈ విధంగా విత్తుకుంటే.. ఒక నెలలో కుండీలోని విత్తనాల నుంచి కొత్తిమీర తయారు అవుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి మిరపకాయలు: ఇది పప్పు లేదా కూరగాయ అయినా పచ్చి మిరపకాయలు లేకుండా ఊహించలేము. మీరు పచ్చి మిరపకాయలను నాటడానికి కుండీలోని మట్టితో పాటు ఆవు పేడ, కోకోపీట్, వేప ఎరువుని కూడా కలపవచ్చు. అనంతరం కుండీలో మిరప మొక్కలను నాటాల్సి ఉంది. కొన్ని నెలల తర్వాత కుండీలోని మొక్కలు పచ్చి మిర్చి కాయలు ను ఇస్తుంది. మధ్య మధ్యలో మొక్కలకు నీరు పోస్తూ ఉండాలి.

జీలకర్ర: జీలకర్ర కూడా ఒక ముఖ్యమైన మసాలా. జీలకర్ర లేని పోపుల పెట్టె అసంపూర్ణంగా కనిపిస్తుంది. జీలకర్ర కలిపిన వెంటనే పప్పు, కూరగాయల రుచి పెరుగుతుంది. చాలా మంది జీలకర్ర అన్నం కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఇంట్లో సేంద్రియ పద్ధతిలో పండించిన జీలకర్ర ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది. జీలకర్రను పెంచుకోవాలంటే 10 అంగుళాల కుండీ తీసుకోవాలి. ఆ తర్వాత ఆవు పేడ, కోకోపీట్ కలిపి మట్టిలో జీలకర్రను విత్తాలి. మధ్యమధ్యలో కుండలో నీళ్లు పోస్తూ ఉండండి. దీంతో కొన్ని నెలల తర్వాత మంచి దిగుబడి వస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..