TV9 Telugu
25 April 2024
పంటి నొప్పి వేధిస్తోందా.?
పంటి నొప్పి వేధిస్తే ఉప్పు నీటితో నోరును పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నాశనం అవుతుంది. నొప్పి కూడా తగ్గిపోతుంది.
లవంగం నూనె కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులోని ఎనల్జీసిక్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పంటి నొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పంటి నొప్పి ఉన్న చోట ఐస్‌తో మర్దన చేయాలి. ఇందుకోసం ఒక వస్త్రంలో మంచు ముక్కు తీసుకోవాలి. అనంతరం నొప్పి ఉన్న చోట బుగ్గపై ఐస్ పెట్టాలి.
పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెప్పర్‌మెంట్ టీ తీసుకోవడం పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లిలో యాంటీమైక్రోబియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులోని మంచి గుణాలు చిగుళ్ల నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
బేకింగ్ సోడా కూడా పంటి నొప్పి నుంచి ఉపశమనం కల్పించడంలో ఉపయోగపడుతుంది. టూత్ పేస్ట్‌లో బేకింగ్ సోడాను కలుపుకుంటే పంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..