వేసవిలో లిచీ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Jyothi Gadda

25 April 2024

లిచీ పండు అద్భుతమైనది. ఎండకాలం లిచీని మన డైట్లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యకరం. ఎందుకంటే ఇందులో విటమిన్ సీ, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి.  ఇది మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ సమస్య నుంచి కాపాడి కణాలు పాడవ్వకుండా సహాయపడుతుంది.

వేసవిలో లిచీ పండు తినటం ఇమ్యూనిటీ బూస్ట్‌గా పనిచేస్తుంది. లిచీలో విటమిన్‌ సీ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. అంతేకాదు ఎండకాలం వచ్చే సీజనల్ జబ్బుల నుంచి మనల్ని కాపాడుతుంది.

లిచీని ఎండకాలం మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి రోజంతటికీ కావాల్సినంత హైడ్రేషన్‌ను అందిస్తుంది. ఎందుకంటే లిచీలో నీటి శాతం అధికంగా ఉంటుంది.

లిచీలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు మలబద్ధకం సమస్య నుంచి కాపాడుతుంది. లిచీ రుచి తీయ్యగా ఉంటుంది. కానీ, ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. లిచీలో కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. 

లిచీ తినటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. లిచీలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్‌ ప్రెజర్ స్థాయిలను నిర్వహిస్తాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి. లిచీలో సహజసిద్ధమైన చక్కెలరలు ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తినిస్తాయి.

లిచీలో రాగి, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. మెరుగైన రక్తప్రసరణకు ప్రేరేపిస్తాయి. లిచీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సన్ బర్న్, ఎండ వేడిమి నుంచి కలిగే ర్యాష్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

లిచీల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని సన్‌ డ్యామేజ్ నుంచి కాపాడి త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది. ప్రతి రోజు ఈ పండ్లతో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

ఈ పండ్ల రసం తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి లభించి.. సీజనల్‌ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.  గొంతు నొప్పి, జ్వరం, జలుబు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.