రోజూ కొన్ని లవంగాలు నమిలి తింటే శరీరంలో జరిగే ఈ మార్పులు ఊహించలేరు..! సర్వరోగాలకు ఇది దివ్యౌషధం..

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచివి. లవంగాలలో యూజినాల్, ఫ్లేవనాయిడ్స్ వంటి హైడ్రో-ఆల్కహాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆహారంలో తక్కువ మోతాదులో రోజూ లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది. ఇది సహజంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బోలు ఎముక వంటి ఎముక సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

రోజూ కొన్ని లవంగాలు నమిలి తింటే శరీరంలో జరిగే ఈ మార్పులు ఊహించలేరు..! సర్వరోగాలకు ఇది దివ్యౌషధం..
Clove
Follow us

|

Updated on: Aug 19, 2024 | 4:27 PM

వంటగది మసాలాలు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతాలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మన ఆయుర్వేదంలో ఏళ్ల తరబడి వంటింట్లో లభించే మసాలాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అటువంటి మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. రుచిలో ఘాటుగా ఉండే లవంగాలు కూర, చారు వంటి వంటకాల రుచి, సువాసనను పెంచుతుంది. లవంగాలు సిజిజియం అరోమాటికమ్ చెట్టు నుండి సేకరించిన ఎండిన పూల మొగ్గలు. లవంగాలు జీర్ణ సంబంధిత వ్యాధులు, దంత రుగ్మతలకు మంచి వైద్యంలా పనిచేస్తుంది. లవంగాలను కామోద్దీపనగా కూడా ఉపయోగిస్తారు. రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల జీవక్రియ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. లవంగం ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లవంగాల వాడకం జీర్ణక్రియకు మంచిది. లవంగాలు సహజంగా ఎంజైమ్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనం తర్వాత రెండు లవంగాలు తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ చికాకు, అజీర్తి, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరచడంలో మరింత సహాయపడుతుంది. అంతేకాదు…లవంగాలు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. లవంగాలలోని యూజినాల్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది సహజంగా శుద్ధి చేయడం ద్వారా రక్తంలో విషపూరిత స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలతో టీ తయారు చేసి కూడా తీసుకోవచ్చు. దీంతో సీజనల్‌ వ్యాధులు, ఇతర వ్యాధులను ఎదుర్కోగల నిరోధక శక్తి పెరుగుతుంది.

ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారను. లవంగం, దాని పదార్దాలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మంచివి. లవంగాలలో యూజినాల్, ఫ్లేవనాయిడ్స్ వంటి హైడ్రో-ఆల్కహాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆహారంలో తక్కువ మోతాదులో రోజూ లవంగాలను ఉపయోగించడం వల్ల శరీరంలో ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది. ఇది సహజంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బోలు ఎముక వంటి ఎముక సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

లవంగం నూనె, లవంగాల పదార్దాలలో యూజినాల్ పుష్కలంగా ఉంటుంది. ఇది వాపు వల్ల కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే లవంగాలను ఆహారంలో చేర్చడం లేదా ప్రభావిత ప్రాంతాల్లో లవంగం పేస్ట్ని పూయడం వల్ల అధిక నొప్పిని నయం చేయవచ్చు. పంటి నొప్పిని తగ్గించడానికి లవంగం నూనెను కూడా ఉపయోగిస్తారు. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. కొన్ని నివేదికల ప్రకారం, లవంగాలు తినడం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడం ద్వారా చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం