Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut fruit cake: గుడ్లు , ఓవెన్ లేకుండా తక్కువ టైంలోనే రుచికరమైన కోకోనట్ ఫ్రూట్ కేక్ చేసుకోండి.. రెసిపీ

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కేక్ తినడానికి ఇష్టపడతారు. అయితే బేకరీ షాప్ లో దొరికే కేక్ ని తినడానికి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇంట్లో కేక్ ని టేస్టీ టేస్టీగా తయారు చేసుకోండి. ఈ రోజు బేక్ చేయవలసిన అవసరం లేని, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన కేక్ రెసిపీ గురించి తెలుసుకుందాం..

Coconut fruit cake: గుడ్లు , ఓవెన్ లేకుండా తక్కువ టైంలోనే రుచికరమైన కోకోనట్ ఫ్రూట్ కేక్ చేసుకోండి.. రెసిపీ
Coconut Fruit CakeImage Credit source: unsplash
Surya Kala
|

Updated on: Sep 08, 2025 | 11:17 AM

Share

పుట్టినరోజులు, వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో, ఇళ్లలో కేక్ కట్ చేయడం నేటి ట్రెండ్. అయితే ఈ కేక్ ని మీ సొంత చేతులతో తయారు చేస్తే మరింత ఆనందంగా ఉంటుంది. కేక్ ప్రత్యేక సందర్భాలలో మరింత ఆనందాన్ని నింపుతుంది. ఇది చాలా రుచికరమైన డెజర్ట్. కేక్ ని వివిధ రుచులలో వివిధ మార్గాల్లో తయారు చేయవచ్చు. అయితే ఎక్కువగా కేక్ లను బేకింగ్ చేసి తయారు చేస్తారు. అయితే ఎప్పుడైనా కేక్ ని బేక్ చేయకుండా కేవలం పండ్లు, కొబ్బరిని ఉపయోగించి తయారు చేయడం చూశారా..? ఈ కేక్ చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలుం, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కేక్ ని చాలా ఇష్టపడతారు. నిజానికి.. ఇది జెల్లీ కేక్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అందరూ ఇష్టంగా తినే కేక్ ని ఇంట్లో పరిశుభ్రంగా చేసుకోవచ్చు. ఈ రోజు కోకోనట్ ఫ్రూట్ కేక్ రెసిపీని తెలుసుకుందాం.

కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

తాజా కొబ్బరి

కండెన్స్‌డ్ మిల్క్

ఇవి కూడా చదవండి

మొక్కజొన్న పిండి రెండు స్పూన్లు

ఆపిల్,

కివి,

దానిమ్మ

అరటిపండు,

ద్రాక్ష లేదా మీకు ఇష్టమైన పండ్లు

కేక్ తయారీ విధానం:

ముందుగా ఆపిల్, చీకూ, కివి, అరటిపండు వంటి పండ్ల తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి. కొంచెం కొబ్బరికి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు కొబ్బరికి ఉన్న ముదురు రంగు తొక్కని తీసి.. పూర్తిగా తెల్లగా ఉన్న కొబ్బరిని ముక్కలు చేసి మిక్సిలో వేసి గ్రైండ్ చేయండి. తర్వాత ఈ కొబ్బరి గుజ్జుని ఒక గిన్నెలోకి వడకట్టండి. ఇలా రెండు కప్పుల కొబ్బరి పాలు తీసుకోండి.

ఇప్పుడు రెండు కప్పుల కొబ్బరి పాలల్లో రెండు స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలపండి. తర్వాత కండెన్స్‌డ్ మిల్క్ కూడా జోడించండి. బాగా కలిపి ఈ పాలను కలపండి. ముద్దలు లేకుండా సిద్ధం చేయండి.

ఇలా రెడీ చేసిన కొబ్బరి పాల మిశ్రమాన్ని ఒక దళసరి గిన్నెలో వేసి గ్యాస్ మీద పెట్టి మీడియం మంట మీద నిరంతరం కలుపుతూ ఉడికించాలి. ఇలా 8 నుంచి 10 నిమిషాలలో కొబ్బరి పాల మిశ్రమం చిక్కగా కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో గ్యాస్ ఆపివేసి.. మిశ్రమాన్ని కొద్దిగా చల్లబరచండి. దీని తరువాత కేట్ చేసుకున్న పండ్లను ఈ మిశ్రమంలో వేసి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను జోడించండి.. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తర్వాత మీకు నచ్చిన అచ్చులో ఈ మిశ్రమం వేసి కనీసం 2-3 గంటలు ఫ్రిజ్‌లో ఉంచండి. అంతే చల్లని, రుచికరమైన కోకోనట్ ఫ్రూట్ కేక్ సిద్ధం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..