Health Tips: పనీర్, ఎగ్స్, చికెన్.. దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? ఏది ఆరోగ్యానికి మంచిది!
మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే ఆహరంలో పోటీన్ ఉండడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే. ఎందుకంటే ప్రోటీన్ మనం ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా మంది ప్రోటిన్ పొందేందుకు చికెన్, గుడ్లు, పనీర్ తింటుంటారు. అయితే ఈ మూడింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఏది మీ ఆరోగ్యకరమైందనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఈ మధ్య చాలా మంది జిమ్ వెళ్తూ ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాయామం చేసిన తర్వాత ప్రోటిన్ కలిగిన ఆహారం తీసుకోవాలనుకుంటారు. ఈ ప్రోటీన్ పొందడానికి కొందరు పనీర్ తినమని, మరికొందరు చికెన్ లేదా గుడ్లు తినమని వారికి సలహా ఇస్తారు. అలాంటప్పుడు వారు ఏది తినాలో అనే గందరగోళంలో పడిపోతారు. నిజానికీ ఈ మూడు ఆహారాలు ప్రోటిన్ పొందడానికి చాలా మంచి ఎంపిక. వాటిలో చాలా పోషకాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి, ఏది మంచిది అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం.
గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉంటుంది?
తక్కువ ధరకే మంచి ప్రోటిన్ లభించే ఫుడ్‌లో ఎగ్స్ మొదటి ప్లేస్‌లో ఉంటాయి. సాధారణంగా ఒక గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే మీటిలో విటమిన్లు బి, బి12, డి, ఇ, భాస్వరం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా, గుడ్డులోని తెల్లసొన స్వచ్ఛమైన ప్రోటీన్‌కు ఉత్తమ మూలం. పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర విటమిన్లు కూడా ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.
పనీర్ ఎంత ప్రోటీన్ ఉంటుంది?
మాంసం తినని వారు ప్రోటీన్ పొందాలనుకుంటే పనీర్ ఒక మంచి ఎంపిక. ఎందుకంటే పనీర్‌లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. సుమారు 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 20 నుండి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు, లాక్టోస్ తక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది. దీనితో పాటు, పనీర్‌లో పెద్ద మొత్తంలో కాల్షియం, భాస్వరం ఉంటాయి ఇవి ఎముకలను బలంగా ఉండేందుకు సహాయపడుతాయి.
చికెన్‌లో అత్యధిక ప్రోటీన్ ఉంటుంది.
మాంసాహారులు అయితే చికెన్ ద్వారా ప్రోటీన్‌ను తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే హెల్త్‌లైన్ ప్రకారం, 100 గ్రాముల చికెన్‌లో 20 నుండి 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే, ఇది మొత్తం చికెన్ ఎలా వండుతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రోటీన్‌తో పాటు, చికెన్ అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చికెన్ తినడం వల్ల మీ బరువు నియంత్రణలో ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు.
మీ శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ తీసుకోండి.
ప్రతి వ్యక్తి శరీర బరువు , వయస్సును బట్టి ప్రోటీన్ అవసరాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, 75 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు దాదాపు 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. మూడు ఆహారాలు ప్రోటీన్ యొక్క మంచి వనరులు అయినప్పటికీ, వాటిలో ప్రోటీన్ పరిమాణం మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ మీ శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే, అత్యధిక ప్రోటీన్ చికెన్‌లో లభిస్తుంది. అయితే మీ అవసరాలు, ప్రాధాన్యతల ప్రకారం మీరు ఈ ఆహారాలలో దేనినైనా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




