Fennel Tea : సోంపు టీతో జీర్ణ సమస్యలకు చెక్..! క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం..? ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి..

Fennel Tea : సోంపు గింజలను రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. వీటిని భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడుతారు.

Fennel Tea : సోంపు టీతో జీర్ణ సమస్యలకు చెక్..! క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం..? ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోండి..
Fennel Tea
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Jul 08, 2021 | 8:33 AM

Fennel Tea : సోంపు గింజలను రకరకాల వంటలలో ఉపయోగిస్తారు. వీటిని భోజనం తర్వాత మౌత్ ఫ్రెషనర్‌గా కూడా వాడుతారు. సోంపు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు. కంటి చూపు మెరుగుపడుతుంది. బరువు తగ్గిస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలకు చక్కగా పనిచేస్తుంది. ఇంట్లో టీ తయారు చేయడానికి ఫెన్నెల్ కూడా ఉపయోగపడుతుంది. ఈ పానీయం సాధారణ జీర్ణ సమస్యలతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది.

పేలవమైన జీర్ణక్రియ అనేది మీ రోజువారీ పనితీరును ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. మీరు దీన్ని ఇంటి నివారణగా ఉపయోగించవచ్చు. జీర్ణ సమస్యలను అధిగమించడానికి ఫెన్నెల్ టీ సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. అనేక జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది. ఫెన్నెల్ టీ తాగడం వల్ల గ్యాస్, ఉబ్బరం తొలగించవచ్చు. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సోపు గింజలు క్యాన్సర్ సమస్యను నివారించడంలో సహాయపడతాయి. కడుపు, చర్మం లేదా రొమ్ము క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఫెన్నెల్ సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ శరీరాన్ని రక్షిస్తుంది. ఫెన్నెల్ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ టీ శ్వాసకోశ సమస్య ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి ఫెన్నెల్ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సోంపు అనేది యాంటీఆక్సిడెంట్ల శక్తివంతమైన మూలం. ఇది కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. వేడి ఫెన్నెల్ టీ తాగడం వల్ల రుతు సమస్యలు తగ్గుతాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల సోంపును రెండు కప్పుల నీటిలో వేయండి. దీనికి కొన్ని పుదీనా ఆకులు జోడించండి. ఈ నీటిని రెండు మూడు నిమిషాలు మరిగించండి. రుచి కోసం తేనెను జోడించవచ్చు.

పిడుగు పడటాన్ని ముందే గుర్తించవచ్చా..! అసలు పిడుగు అంటే ఏమిటీ.. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోండి..

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్ల ఆహ్వానం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..