AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot milk or Cold milk: ఆరోగ్యానికి వేడిపాలు మంచివా.. చల్లటి పాలు మంచివా.. ఎప్పుడు ఏ సమయంలో తాగాలంటే..

Hot milk or Cold milk: పాలు సమీకృత ఆహారం. పాలల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. కనుక రోజు పాలను తాగితే.. అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.. అయితే కొంతమంది..

Hot milk or Cold milk: ఆరోగ్యానికి వేడిపాలు మంచివా.. చల్లటి పాలు మంచివా.. ఎప్పుడు ఏ సమయంలో  తాగాలంటే..
Milk
Surya Kala
|

Updated on: Jul 07, 2021 | 5:12 PM

Share

Hot milk or Cold milk: పాలు సమీకృత ఆహారం. పాలల్లో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. కనుక రోజు పాలను తాగితే.. అనేక అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.. అయితే కొంతమంది వేడి వేడిగా పాలను తాగితే.. మరికొందరు చల్లారిన పాలను తాగడానికి ఇష్టపడతారు. వేడిపాలు తాగితే మంచిదా.. లేక చల్లటి పాలు తాగితే మంచిదా అంటే పాలను ఎలా తాగినా మంచిదే అంటున్నారు డాక్టర్లు. రోజూ ఒక గ్లాసు పాలను తాగేవారిలో ఎముకలు మంచి బలంగా ఉంటాయని శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.

చల్లటి పాలను తాగడం వలన కలిగే ఉపయోగాలు :

చల్లటి పాలను వేసవికాలంలో తాగితే.. శరీరంలోని వేడి తగ్గుతుంది. చల్లటి పాలల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కనుక చల్లటి పాలు తాగితే ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో చల్లటి పాలు తాగితే మంచిది కాదని అంటున్నారు. ఎందుకంటే చల్లటి పాలు తగిన వెంటనే నిద్రపోతే కొన్ని సార్లు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే దగ్గు, రొంప వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కనుక రాత్రిపూట చల్లటి పాలను తాగకుండా ఉండటం మంచిది.

వేడి పాలు తాగడం వల్ల కలిగే లాభాలు :

వర్షాకాలంలో , శీతాకాలంలో రాత్రిపూట వేడి వేడి పాలు తాగితే.. చర్మం వేడిగా ఉంటుంది. అంతేకాదు నిద్ర కూడా ఈజీగా పడుతుంది. వేడి పాలల్లో కూడా కాల్షియం, విటమిన్-డి, పొటాషియం ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వేడి పాలు ఏ సమయంలో తాగినా ఈజీగా జీర్ణమవుతాయి.

Also Read: Vanisri: వ్యాంప్ పాత్రల నుంచి స్టార్ హీరోయిన్ గా కళాభినేత్రిగా ఎదిగిన ఈ నటి జీవితం నేటి తరానికి ఆదర్శవంతం

: 11 మంది మంత్రులు ఔట్.. ఏడుగురికి ప్రమోషన్.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

 ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా