New Cabinet Minister of India 2021: మోడీ కొత్త మంత్రివర్గంలో కొత్తగా 36మందికి చోటు..7గురు సహాయమంత్రులకు ప్రమోషన్..
PM Modi New Ministers Cabinet Highlights: రాష్ట్రపతిభవన్‌లో కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం కలర్‌ఫుల్‌గా జరిగింది. 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు.
PM Modi New Ministers Cabinet Highlights : రాష్ట్రపతిభవన్‌లో కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారం కలర్‌ఫుల్‌గా జరిగింది. 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డితో సహా 10 మందికి కేబినెట్ హోదా లభించింది. జ్యోతిరాదిత్యాసింధియా , శర్వానంద్ సోనోవాల్ , కిరణ్ రిజీజ్,హర్దీప్‌సింగ్‌పూరి ,అనురాగ్ ఠాకూర్,మన్సూక్ మాండవియా,పురుషోత్తం రూపాలాకు కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ లభించింది. నారాయణ్‌రాణే, వీరేంద్రకుమార్, రాంచంద్రప్రసాద్‌సింగ్,అశ్విని వైష్ణవ్, పశుపతి పారస్ , కిరణ్ రిజీజ్, రాజ్‌కుమార్‌సింగ్, భూపేంద్రయాదవ్‌కు కేబినెట్ హోదా లభించింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అప్‌డేట్స్ మీకోసం..
Union Cabinet Expansion 2021 Updates:
LIVE NEWS & UPDATES
-
మంత్రివర్గ విస్తరణకు ముందు..
మంత్రివర్గ విస్తరణకు ముందు.. 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేశారు. అందులో ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్, సదానంద గౌడ, రమేశో పోఖ్రియాల్, హర్షవర్ధన్ ఉన్నారు.
-
43 మందిలో 36 మంది కొత్తవారు…
43 మందిలో 36 మంది కొత్తవారు కాగా, ఏడుగురు పదోన్నతి పొందినవారు ఉన్నారు. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్ రిజిజు, మన్‌సుఖ్ మాండవియా, హరిదీప్‌సింగ్ పురీ, రామచంద్ర ప్రసాద్ సింగ్.. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
-
-
ఉత్తర్‌ప్రదేశ్ నుంచే అత్యధికంగా…
మోడీ నూతన మంత్రి మండలిలో.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచే అత్యధికంగా ఏడుగురు ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, బంగాల్, బిహార్ నుంచి ముగ్గురు చొప్పున ప్రాతనిధ్యం దక్కింది.
-
మోడీ కొత్త మంత్రివర్గంలో ఐదుగురు మాజీ సీఎంలు.. 13 మంది డాక్టర్లు, ఐదుగురు ఇంజనీర్లు..
మోడీ నూతన కేబినెట్‌లో చోటు దక్కిన వారిలో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రతి ఒక్కరిది… ఒక్కో ప్రత్యేకత.. ముఖ్యంగా కొత్త మంత్రి వర్గంలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. 19 మంది మాజీ రాష్ట్ర మంత్రులు, 39 మంది మాజీ ఎమ్మెల్యేలు, రెండు లేదా మూడు సార్లు నెగ్గిన 23 మంది ఎంపీలు ఉన్నారు. ఆసక్తికరంగా నూతన మంత్రివర్గంలో చోటు దక్కించుకుని ప్రమాణస్వీకారం చేసిన 43 మందిలో 13 మంది డాక్టర్లు, ఐదుగురు ఇంజనీర్లు, ఏడుగురు సివిల్ సర్వెంట్లు ఉన్నాయి.
-
మోడీ మంత్రివర్గంలో మంత్రుల పూర్తి వివరాలు ఇవే…
5. నారాయణ్ రాణే, మహారాష్ట్ర (69 సం.) తొలుత శివసేనలో, తరువాత 2017 వరకూ కాంగ్రెస్‌లో, 1999లో కాంగ్రెస్ తరపున సీఎంగా పని చేసిన రాణే 2017లో సొంత పార్టీ మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీ స్థాపన 2018లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక విద్యార్హతలు…
6. దర్శన విక్రమ్ జర్దోష్, గుజరాత్ (60 సం.) గుజరాత్ బీజేపీ నేత, సూరత్ నుంచీ వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీకాం డిగ్రీ, నిట్ లో సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్స్
7. నితిష్ ప్రామాణిక్, పశ్చిమబెంగాల్ (35 సం.) తృణమూల్ కాంగ్రెస్ నుంచీ బీజేపీలో చేరి 2019లో కూచ్‌బేహార్ నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీసీఏ డిగ్రీ
8. శంతను ఠాకూర్, పశ్చిమబెంగాల్ (38 సం.) 2019లో బీజేపీ తరపున బంగాన్ లోక్‌సభ నుంచీ ఎన్నిక విద్యార్హతలు… గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ (హానర్స్)
9. భూపేందర్ యాదవ్, రాజస్థాన్ (52 సం.) 2012 నుంచీ రెండోసారి రాజ్యసభలో బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం విద్యార్హతలు… బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ
10. అశ్వని వైష్ణవ్, ఒడిశా (52 సం.) 2019లో ఒడిశా నుంచీ బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక విద్యార్హతలు… ఎంటెక్, ఐఐటీ ఖరగ్‌పూర్, మాజీ ఐఏఎస్(1994 బ్యాచ్)
11. కపిల్ మోరేశ్వర్ పాటిల్, మహారాష్ట్ర (60 సం.) ఎన్సీపీ నుంచీ బీజేపీలో చేరి 2014, 2019లలో భివాండీ లోక్‌సభ స్థానం నుంచీ ఎన్నిక విద్యార్హతలు… బీఏ డిగ్రీ
12. మీనాక్షీ లేఖి, ఢిల్లీ (54 సం.) బీజేపీ తరపును న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచీ 2014, 2019లలో ఎంపీగా ఎన్నిక విద్యార్హతలు… ఎల్‌ఎల్‌బీ లా డిగ్రీ
13. అజయ్ భట్, ఉత్తరాఖండ్ (60 సం.) 2019లో నైనిటాల్ ఉద్దం సింగ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నిక 2017వరకు ఉత్తరఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా అజయ్ బట్ రానికేట్ ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎన్నిక విద్య: బీఏ, ఎల్ఎల్ బీ
14. పశుపతి పరాస్, బీహార్ (69 సం) పార్టీ: లోక్ జన్ శక్తి పార్టీ 1977-2010 వరకు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నిక 2017-2019 వరకు ఎమ్మెల్సీ 2019లో హాజీపూర్ లోక్‌సభ నుంచీ ఎన్నిక
15. భారతీ పవార్, మహారాష్ట్ర (43 సం.) 2019లో దిందోరి నియోజకవర్గం నుంచీ మొదటిసారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… పూనే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన భారతి డిసెంబర్ 2019లో బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపిక
16. బీఎల్ వర్మ, ఉత్తరప్రదేశ్ (60సం.) నవంబర్ 2020 నుంచీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు విద్య: ఎంఎ
17. అజయ్ కుమార్ మండల్, పార్టీ: జేడీ(యు), బీహార్ (50 సం.) 2019లో బాగల్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నిక విద్య: 9వ తరగతి
18. రాజీవ్ చంద్రశేఖర్, గుజరాత్ (57 సం) కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం విద్య: బీ.ఈ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్
19. మహేంద్ర ముంజపర, గుజరాత్ (52 సం.) సురేంద్రనగర్ నుంచీ 2019లో లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… డాక్టర్
20. జాన్ బార్లా. పశ్చిమబెంగాల్ (43 సం.) అలిపుర్దార్స్ నియోజకవర్గం నుంచీ 2019లో లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… 8వ తరగతి
21. సుభాష్ సర్కార్, పశ్చిమబెంగాల్ (68 సం.) 2019 లోక్‌సభ ఎన్నికల్లో బంకుర నియోజకవర్గం నుంచీ ఎంపీగా ఎన్నిక విద్యార్హతలు… డాక్టర్
22. ఎల్. మురుగన్, తమిళనాడు (44 సం.) బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు, ప్రస్తుతం ఏ సభలోనూ ఎంపీ కాదు విద్యార్హతలు… ఎల్‌ఎల్‌ఎమ్, లాయర్
23. సుస్రీ ప్రతిమా భౌమిక్ , త్రిపుర 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ త్రిపుర నియోజకవర్గం నుంచీ ఎన్నిక
24. భగవంత్ ఖుబా, కర్ణాటక (54 సం.) బీదర్ నుంచీ రెండోసారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బిఈ, మెకానికల్ ఇంజనీరింగ్
25. దేవుసిన్హ్ జేసింగ్‌భాయ్ చౌహాన్, గుజరాత్ (56 సం.) 2014,2019 లలో ఖేడా నియోజకవర్గం నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
26. అబ్బయ్ నారాయణస్వామి, కర్ణాటక (64 సం.) 2019లో చిత్రదుర్గ నియోజకవర్గం నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీఏ డిగ్రీ
27. మాన్సుఖ్ మాండవీయ, గుజరాత్ (49 సం.) ప్రస్తుతం కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యుడు విద్యార్హతలు… ఎంఏ పొలిటికల్ సైన్స్
28. పురుషోత్తం రూపాల, గుజరాత్ (66 సం.) ప్రస్తుతం కేంద్ర పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యుడు విద్యార్హతలు… బీఎస్సీ, బిఈడీ
29. హర్‌దీప్ సింగ్ పూరి, పంజాబ్,ఢిల్లీ (69 సం.) ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి(ఇండిపెండెంట్ ఛార్జి), రాజ్యసభ సభ్యుడు విద్యార్హతలు… ఎంఏ హిస్టరీ
30. అనురాగ్ సింగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ (46 సం.) ప్రస్తుతం కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ కుమారుడు, హమిపూర్ నుంచీ వరుసగా నాల్గవ సారి లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీఏ డిగ్రీ
31. వీరేంద్ర కుమార్, మధ్యప్రదేశ్ (67 సం.) 1996 నుంచీ వరుసగా 7వ సారి ఎంపీ ఎన్నిక, ప్రస్తుతం తికంఘర్ నుంచీ లోక్‌సభ సభ్యుడు విద్యార్హతలు… పీహెడ్‌డీ
32. పంకజ్ చౌదరి, ఉత్తర్‌ప్రదేశ్ (56 సం.) మహరాజ్‌గంజ్ నియోజకవర్గం నుంచీ 6సార్లు లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీఏ డిగ్రీ
33. అనుప్రియ పటేల్, ఉత్తరప్రదేశ్ (40 సం.) మీర్జాపూర్ నుంచీ రెండవసారి లోక్‌సభకు ఎన్నిక, 2016-19 మధ్య కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి విద్యార్హతలు… ఎంఏ సైకాలజీ, ఎంబీఏ
34. రాజ్ కుమార్ డాక్టర్ రంజన్ సింగ్, మణిపూర్ (69సం.) 2019 లోక్ సభ ఎన్నికల్లో… ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నిక విద్య ఎంఎ(భూగోళ శాస్త్రం), బీ.టీ & పీహెచ్ డీ
35. బిశ్వేశ్వర్ టుడు, ఒడిశా (56 సం.) 2019 లోక్ సభ ఎన్నికల్లో మయూర్ భంజ్ నియోజకవర్గం నుంచి ఎన్నిక విద్య: డిఫ్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
36. డాక్టర్ భాగవత్ కరాడ్, మహారాష్ట్ర (65 సం.) 2020 నుంచీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు విద్య:ఎంబీబీఎస్, ఎంఎస్(జనరల్ సర్జరీ) ఎం.సీహెచ్(పీడియాట్రిక్ సర్జరీ), ఎఫ్.సీ.పీ.ఎస్(జనరల్ సర్జరీ)
37. కౌషల్ కిశోర్, ఉత్తర్‌ప్రదేశ్ (61సం.) 2014,2019 లలో మోహన్ లాల్‌గంజ్ నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్య: ఇంటర్మీడియెట్ వృత్తి: వ్యవసాయం
38. జి. కిషన్ రెడ్డి, తెలంగాణ (61 సం.) 2019లో సికింద్రాబాద్ నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు; టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా 2004 ,2009 ,2014 లో ఎమ్మెల్యేగా పనిచేసిన కిషన్ రెడ్డి
39. అన్న పూర్ణా దేవి, జార్ఖండ్ (51 సం.) 2019 లో జార్ఖండ్ రాష్ట్రం కొదర్మ నియోక వర్గం నుంచి ఎంపీగా విజయం గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా,రాష్ట్రమంత్రిగా పనిచేసిన అన్నపూర్ణా దేవి విద్యార్హతలు… రాంచీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యేయేషన్ పూర్తి
40. కిరణ్ రిజూజు, అరుణాచల్‌ప్రదేశ్ (50సం.) ప్రస్తుతం కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి పశ్చిమ అరుణాచల్ నుంచి ఎంపీగా ఉన్న కిరణ్ రిజూజు విద్యార్హతలు… ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన కిరణ్
41. సత్యపాల్ సింగ్ బాగేల్, ఉత్తరప్రదేశ్ (61 సం.) సమాజ్ వాది పార్టీ నుంచీ మూడు సార్లు ఎంపీ, 2019లో బీజేపీలో చేరి ఆగ్రా నుంచీ లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… ఎంఎస్సీ, లా గ్రాడ్యుయేట్
42. రాజ్ కుమార్ సింగ్, బీహార్ (68 సం.) ప్రస్తుతం కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ చార్జి) 2014, 2019 లలో బీహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచీ బీజేపీ తరపున లోక్‌సభకు ఎన్నిక విద్యార్హతలు… బీఏ, ఎల్‌ఎల్‌బీ
43. రామచంద్ర ప్రసాద్ సింగ్, పార్టీ…జేడీయూ, బీహార్ (62సం.) 2020లో రాజ్యసభకు ఎంపిక విద్యార్హతలు… ఎంఏ
-
-
మోడీ మంత్రివర్గంలో మంత్రులు… వారి నేపథ్యం ఇదే..
మోడీ మంత్రివర్గంలో మంత్రులు…
1. శోభ కరందలాజే, కర్ణాటక (54 సం.)… కర్ణాటక బీజేపీ నాయకురాలు, ఉడుపి చిక్‌మంగళూర్ నుంచి ఎంపీగా రెండోసారి గెలుపు, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం. 2008-13 మధ్య ఎమ్మెల్యే, కర్ణాటక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి విద్యార్హతలు… ఎంఏ సోషియాలజీ
2. భాను ప్రతాప్ సింగ్ వర్మ, ఉత్తరప్రదేశ్ (63 సం.)… ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత, జాలౌన్ నుంచీ 1996 నుంచీ 5 సార్లు ఎంపీగా ఎన్నిక విద్యార్హతలు… ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
3. శర్బానంద సోనోవాల్, అస్సాం (59 సం.)… అస్సాం బీజేపీ నేత, 2014-16 మధ్య ఒకసారి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి 2016 మే నుంచీ 2021 మే 10 వరకూ అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు విద్యార్హతలు… బిఏ, ఎల్‌ఎల్‌బీ
4. జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్‌లో (50 సం.)… మధ్యప్రదేశ్‌లో 2001లో మాధవరావ్ సింధియా మరణం తర్వాత రాజకీయ ప్రవేశం, 2001-14 వరకూ నాలుగు సార్లు గుణ నియోజకవర్గం నుంచి ఎన్నిక 2007-14 మధ్య యూపీఏ మంత్రివర్గంలో కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖల మంత్రి 2019లో ఓటమి, 2020 మార్చిలో బీజేపీలో చేరిక, 2020 జూన్‌లో రాజ్యసభ సభ్యత్వం విద్యార్హతలు… ఎంబీఏ
-
ప్రధాని మోడీ కేబినెట్‌లో పెరిగిన మహిళా శక్తి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉమెన్ పవర్ పెరిగింది. ఏడుగురు మహిళలకు కొత్తగా మంత్రి మండలిలో చేరారు. వీరిలో NDAలో భాగస్వామ్య పక్షం అప్నాదళ్ (S) నేత అనుప్రియ పటేల్ కూడా ఉన్నారు.
- మీనాక్షి లేఖి
- అనుప్రియ సింగ్ పటేల్
- శోభ కరంద్లాజే
- దర్శన విక్రమ్ జర్దోశ్
- అన్నపూర్ణ దేవి
- ప్రతిమ భౌమిక్
- భారతి ప్రవీణ్ పవార్
ఇప్పటికే నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ కేంద్ర మంత్రులుగా తమ ప్రతిభను చాటుకుంటున్న సంగతి తెలిసిందే…
-
ఇప్పటి వరకు 15 మంది కేబినెట్, 8 రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం
కేంద్ర మంత్రులుగా ఎస్పీ సింగ్ బాగెల్, రాజీవ్ చంద్రశేఖర్, శోభా కరంద్లాజే, భాను ప్రతాప్ సింగ్ వర్మ, దర్శన విక్రమ్ జర్దోష్, మీనాక్షి లేఖీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 43 మంది నాయకులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది కేబినెట్, 8 రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
-
సహాయ మంత్రులుగా వీరికి ప్రమోషన్..
ప్రధాని మోడీ టీమ్ 2021 :
- 43 మంది ప్రమాణస్వీకారం
- కొత్తగా 36మందికి చోటు
- 7గురు సహాయమంత్రులకు ప్రమోషన్
- 12మందికి ఉద్వాసన
7గురు సహాయ మంత్రులకు ప్రమోషన్…
- హర్దీప్ సింగ్ పూరీ
- ఆర్కె సింగ్
- కిరిణ్ రిజుజు
- అనురాగ్ సింగ్ ఠాకూర్
- జి.కిషన్ రెడ్డి
- పురుషోత్తం రూపాలా
- మన్సుడ్ భాయ్ మండవియా
-
కేంద్ర మంత్రిగా కిరణ్ రిజిజు…
కేంద్ర కేబినెట్ మంత్రులుగా అశ్విని వైష్ణవ్, పశుపతి కుమార్ పరాస్, కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవియలకు ప్రమాణ స్వీకారం చేశారు.
-
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొత్త చరిత్ర..
కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనితీరును ప్రధాని మోడీ పరిగణనలోకి తీసుకొని, ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు.
-
కేంద్ర మంత్రులుగా హర్దీప్ సింగ్ పురీ, కిరెణ్ రిజిజు, రాజ్‌కుమార్ సింగ్‌లు
కేంద్ర మంత్రులుగా హర్దీప్ సింగ్ పురీ, కిరెణ్ రిజిజు, రాజ్‌కుమార్ సింగ్‌లు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉన్న వీరు కేబినెట్ హోదా దక్కించుకున్నారు.
#CabinetExpansion2021 | Pashupati Kumar Paras, Kiren Rijiju and Raj Kumar Singh take oath as ministers. pic.twitter.com/XzpZ1ejxdx
— ANI (@ANI) July 7, 2021
-
ఆరోగ్య మంత్రి రాజీనామా అందుకే… – మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి చిదంబరం విమర్శలు గుప్పించారు. ‘కేంద్ర ఆరోగ్య మంత్రి, ఆరోగ్య మంత్రికి రాజీనామా చేయడం చూస్తుంటే.. మోడీ సర్కర్ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ఆయన పూర్తి స్థాయిలో విఫలమైందని స్పష్టంగా అంగీకరించినట్లే అని ఎద్దేవ చేశారు. ఈ రాజీనామాల్లో మంత్రులకు ఒక పాఠం ఉంది. అంతా సరిగ్గా జరిగితే క్రెడిట్ ప్రధానమంత్రికి వెళ్తుంది.., తప్పు జరిగితే మంత్రి విఫలమవుతారు. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘
The resignations of the Union Health Minister and the MoS Health is a candid confession that the Modi government has utterly failed in managing the pandemic
— P. Chidambaram (@PChidambaram_IN) July 7, 2021
-
కేంద్ర మంత్రిగా నారాయణ రాణే, సర్బానంద సోనోవాల్..
కేంద్రం మంత్రులుగా నారాయణ్ టాటు రాణే, సర్బానంద సోనోవాల్ , డా. వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్ కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
#CabinetExpansion2021 | Narayan Tatu Rane, Sarbananda Sonowal, and Dr Virendra Kumar take oath as ministers, at Rashtrapati Bhavan. pic.twitter.com/rAEwl5ziyr
— ANI (@ANI) July 7, 2021
-
చివరి నిమిషంలో షాక్.. మరో ఇద్దరు.. మొత్తం 14..
కేంద్రమంత్రివర్గంలోని సీనియర్లకు ఊహించని షాక్ తగిలింది. కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మొదట కొద్ది మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. అయితే వారితోనే ఈ రాజీనామాలు ఆగిపోతుందని అందరూ ఊహించారు. కానీ… కేబినెట్ విస్తరణకు కొద్ది నిమిషాల ముందు మరో ఊహించని రాజీనాలు చోటు చేసుకున్నాయి. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తోపాటు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాజీనామాల సంఖ్య 14 కు చేరింది. వీరందరి రాజీనామాలకు రాష్ట్రపతి కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
The President of India accepts resignation of 12 members of the Council of Ministers including IT Minister Ravi Shankar Prasad, Environment Minister Prakash Javadekar, Health Minister Harsh Vardhan, Education Minister Ramesh Pokhriyal ‘Nishank and others: Rashtrapati Bhavan pic.twitter.com/mNbP2V3lhn
— ANI (@ANI) July 7, 2021
-
ఇది కేబినెట్ విస్తరణ కాదు.. అధికారం కోసం విస్తరణ.. కాంగ్రెస్ ఫైర్..
కేంద్ర కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా ఫైర్ అయ్యారు. ఇది క్యాబినెట్ విస్తరణ కాదని, అధికారం కోసం చేపడుతున్న విస్తరణ అని ఫైర్ అయ్యారు. అధికార దాహంతోనే ఈ విస్తరణ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
-
కాబోయే మంత్రులతో ప్రధాని మోదీ మీటింగ్..
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోయే నేతలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో కలిశారు. మోదీని కలిసిన వారిలో సహాయ మంత్రుల నుంచి కేబినెట్ మంత్రులగా ప్రమోట్ అయిన వారు సహా.. కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న 18 మంది నేతలు ఉన్నారు.
-
సహకార ఉద్యమం బలోపేతమే లక్ష్యంగా.. కేంద్రంలో కొత్త మంత్రిత్వశాఖ..
కేంద్రంలో కొత్త మంత్రిత్వ శాఖ ఉద్భవించింది. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేశారు. సహకార్ పు సంవృద్ధి(సహకారంతో సంవృద్ధి) విజన్ అనే సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. న్యాయ, పాలనాపరమైన విధానాలను సహకార మంత్రిత్వ శాఖ రూపొందించనుంది. కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలకు కొత్త మంత్రిత్వ శాఖతో వాస్తవరూపు దాల్చే అవకాశం ఉంది.
-
రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 43 మంది నేతలు వీరే..
1. నారాయణ్ రాణే 2. సర్బానంద సోనోవాల్ 3. డా. వీరేంద్ర కుమార్ 4. జ్యోతిరాదిత్య సింధియా. 5. రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్. 6. అశ్విని వైష్ణవ్. 7. పశుపతి కుమార్ పరాస్ 8. కిరెన్ రిజిజు 9. రాజ్ కుమార్ సింగ్. 10. హర్దీప్ సింగ్ పూరి. 11. మన్సుఖ్ మాండవియా. 12. భూపేందర్ యాదవ్. 13. పురుషోత్తం రూపాల. 14. జి. కిషన్ రెడ్డి. 15. అనురాగ్ సింగ్ ఠాకూర్. 16. పంకజ్ చౌదరి. 17. అనుప్రియా సింగ్ పటేల్. 18. డా. సత్య పాల్ సింగ్ బాగెల్. 19. రాజీవ్ చంద్రశేఖర్. 20. శోభా కరంద్లాజే. 21. భాను ప్రతాప్ సింగ్ వర్మ. 22. దర్శన విక్రమ్ జర్దోష్ 23. మీనాక్షి లేకి. 24. అన్నపూర్ణ దేవి. 25. ఎ. నారాయణస్వామి. 26. కౌషల్ కిషోర్. 27. అజయ్ భట్. 28. బిఎల్ వర్మ. 29. అజయ్ కుమార్. 30. చౌహాన్ దేవ్ సింగ్. 31. భగవంత్ ఖుబా. 32. కపిల్ మోరేశ్వర్ పాటిల్. 33. ప్రతిమ భౌమిక్ 34. సుభాస్ సర్కార్. 35. డి.ఆర్. భగవత్ కృష్ణారావు కరాడ్. 36. డి.రాజ్‌కుమార్ రంజన్ సింగ్. 37. భారతి ప్రవీణ్ పవార్. 38. బిశ్వేశ్వర్ తుడు. 39. శాంతను ఠాకూర్. 40. ముంజపారా మహేంద్రభాయ్. 41. జాన్ బార్లా. 42. ఎల్. మురుగన్. 43. నిశిత్ ప్రమాణిక్.
-
మోదీ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులు వీరే..
1. శోభ కరందలాజే, కర్ణాటక 2. భాను ప్రతాప్ సింగ్ వర్మ, ఉత్తరప్రదేశ్ 3. శర్బానంద సోనోవాల్, అస్సాం 4. జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ 5. నారాయణ్ రాణే, మహారాష్ట్ర 6. దర్శన విక్రమ్ జర్దోష్, గుజరాత్ 7. నితిష్ ప్రామాణిక్, పశ్చిమబెంగాల్ 8. శంతను ఠాకూర్, పశ్చిమబెంగాల్ 9. భూపేందర్ యాదవ్, రాజస్థాన్ 10. అశ్వని వైష్ణవ్, ఒడిశా 11. కపిల్ పాటిల్, మహారాష్ట్ర 12. మీనాక్షీ లేఖి, ఢిల్లీ 13. అజయ్ భట్, ఉత్తరాఖండ్ 14. పశుపతి పరాస్, బీహార్ 15. భారతీ పవార్, మహారాష్ట్ర 16. సునీత దుగ్గల్, హర్యానా 17. ప్రీతం ముండే, మహారాష్ట్ర 18. ఆర్పీ సింగ్, బీహార్, జేడీయూ
-
Union Cabinet Expansion 2021: కేంద్ర కొత్త క్యాబినెట్ హైలైట్స్ ఇవే.. విశేషాలేంటంటే..
Union Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మొత్తం 25 రాష్ట్రాలకు ప్రాతినిథ్యం కల్పిస్తున్నారు. వీరిలో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రుల సగటు వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. 50 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మంత్రులు 14 మంది కేబినెట్‌లో ఉన్నారు. మొత్తం మంత్రులలో.. ఎస్సీలు – 12, ఎస్టీలు – 8, ఓబీసీలు – 27, మైనారిటీలు- 5, మహిళలు – 11 ఉన్నారు. ఇక కేంద్ర కేబినెట్‌లో మొత్తం 13 మంది లాయర్లు, డాక్టర్లు – 6, ఇంజనీర్లు – 5, సివిల్ సర్వెంట్లు – 7 చొప్పున ఉన్నారు.
-
ఏడుగురు సహాయ మంత్రులకు కేబినెట్ హోదాకు ప్రమోషన్.. ఎవరెవరంటే..
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నుంచి పలువురికి ఉద్వాసన పలికిన మోదీ.. మరికొందరు సహాయ మంత్రులకు మాత్రం ప్రమోషన్ ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రుల నుంచి కేబినెట్ మంత్రుల హోదా పొందిన వారిలో కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, ఆర్కే సింగ్, కిరెణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, మన్సుఖ్ భాయ్ మండవియా ఉన్నారు.
-
Union Cabinet Expansion 2021: కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న పదకొండు మంత్రి మంత్రులు..
Union Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరికాసేపట్లో నూతన కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. దానికి ముందే కొందరు మంత్రులు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పుకున్న వారిలో హర్షవర్ధన్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, సంతోష్ గంగ్వార్, దాన్వే రావు సాహెబ్ దాదారావు, బాబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి, డి.వి సదానంద గౌడ, వేవశ్రీ చౌదరి, థవర్ చంద్ గెహ్లాట్, సంజయ్ శ్యామ్ రావు ధోత్రే, రతన్ లాల్ కటారియ ఉన్నారు.
-
కేంద్ర కేబినెట్ విస్తరణపై విమర్శలు గుప్పించిన శివసేన ఎంపీ..
కేంద్ర కేబినెట్ విస్తరణపై శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఓ మహిళ ఉండాలని భారతదేశం కోరుకుంటోందని అన్నారు. ఇదే సమయంలో పలువురు మంత్రులు రాజీనామా చేయడంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ రాజీనామాలతో కేబినెట్ మంత్రుల అసమర్థతను, పరిపాలనలో వైఫల్యాలను అంగీకరించడం శుభపరిణామం అని పేర్కొన్నారు.
Wish India would someday get a Woman & Child Development Minister she truly deserves & the ministry gets the importance it truly is.
— Priyanka Chaturvedi?? (@priyankac19) July 7, 2021
With resignations pouring in, heartening to see that government has acknowledged the incompetence of its cabinet ministers and its failure to govern.
— Priyanka Chaturvedi?? (@priyankac19) July 7, 2021
-
PM Modi Cabinet Expansion Live: సంజయ్ ధోత్రే, డీవీ సదానంద గౌడ రాజీనామా..
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
-
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ.. ప్రధాని నివాసానికి చేరుకున్న ఎంపీలు..
కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పలువురు కేంద్ర సహాయ మంత్రులు, ఎంపీలు చేరుకున్నారు. ప్రధాని నివాసానికి చేరుకున్న వీరికి మంత్రి పదవులు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రధాని నివాసానికి చేరుకున్న కేంద్ర సహాయ మంత్రులు, ఎంపీల వివరాలు ఇవే.. 01. జ్యోతిరాదిత్య సింధియా (మధ్య ప్రదేశ్) 02. శర్బానంద్ సోనోవాల్ (అస్సాం) 03. భూపేందర్ యాదవ్, రాజస్థాన్ 04. అనురాగ్ సింగ్ ఠాకూర్ (హిమాచల్) 05. మీనాక్షి లేఖి (ఢిల్లీ) 06. అనుప్రియా పటేల్, అప్నా దళ్, (యూపీ) 07. అజయ్ భట్(ఉత్తరాఖండ్) 08. శోభ కరందలాజే(కర్ణాటక) 09. సునీత దుగ్గల్ (హర్యానా) 10. ప్రీతం ముండే (మహారాష్ట్ర) 11. శంతను ఠాకూర్ (బెంగాల్) 12. నారాయణ్ రాణే (మహారాష్ట్ర) 13. కపిల్ పాటిల్ (మహారాష్ట్ర) 14. పశుపతి పరాస్, ఎల్జేపి 15. ఆర్సిపి సింగ్, జేడీ(యూ) 16. జి కిషన్ రెడ్డి, తెలంగాణ 17. పురుషోత్తం రూపాల 18. అశ్విని వైష్ణవ్, ఒడిశా 19. విజయ్ సొంకర్, యూపీ
Published On - Jul 07,2021 8:25 PM