AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. క్రితం రోజుతో పోలిస్తే, కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,885 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,166 పాజిటివ్...

AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,166 కరోనా పాజిటివ్ కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
Ap Corona
Follow us

|

Updated on: Jul 07, 2021 | 4:35 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. క్రితం రోజుతో పోలిస్తే, కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,885 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 3,166 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఫలితంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,11,231కి చేరింది. మంగళవారం కొత్తగా 4,019 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,65,956కి పెరిగింది.  కోవిడ్ కారణంగా కొత్తగా చిత్తూరులో నలుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరు లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,919కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,356 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,26,08,072 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

భారత్​లో థర్డ్ వేవ్ ముప్పు తక్కువే! ​

కరోనా వైరస్​ డెల్టా ప్లస్​​ వేరియంట్​ వ్యాప్తిపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఊరట కలిగించే విషయం చెప్పింది ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జీనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయాలజీ (ఐజీఐబీ). ఇండియా​ సహా విదేశాల్లోనూ డెల్టా ప్లస్​ ఎఫెక్ట్ తక్కువగానే ఉందని పేర్కొంది. డెల్టాప్లస్​ గురించి ఆందోళన చెందనవసరం లేదని… అయితే అప్రమత్తత, నిశిత పర్యవేక్షణ అవసరమని సీఎస్​ఐఆర్​-ఐజీఐబీ డైరెక్టర్​ డాక్టర్​ అనురాగ్​ అగర్వాల్ చెప్పారు. విదేశాల్లో లేదా భారత్​లోనూ AY.1, AY.2 రకానికి చెందిన వైరస్​లు కనిపంచలేదని ఆయన వెల్లడించారు.

Also Read: ఆఫ్ట్రాల్ ఫోన్ నంబర్ కోసం సూసైడ్ వరకూ వెళ్లాడు.. పిచ్చా..? వెర్రా..?

అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..