కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టిన వేళ..భారతీయులకు ‘ప్రవేశ ద్వారాలు తెరచిన’ మూడు దేశాలు.. అవి ఏవంటే ..?
ఇండియాలో కోవిద్ కేసులు తగ్గడంతో కొన్ని దేశాలు భారతీయులకు..ముఖ్యంగా టూరిస్టులకు తమ దేశాలను సందర్శించేందుకు అనుమతినిస్తున్నాయి. వీటిలో కెనడా, జర్మనీ, మాల్దీవులు ఇక మీరు మా దేశాలకు నిరభ్యంతరంగా రావచ్చునని ప్రకటించాయి. ఇప్పటివరకు ఉన్న బ్యాన్ ఆంక్షలను..
ఇండియాలో కోవిద్ కేసులు తగ్గడంతో కొన్ని దేశాలు భారతీయులకు..ముఖ్యంగా టూరిస్టులకు తమ దేశాలను సందర్శించేందుకు అనుమతినిస్తున్నాయి. వీటిలో కెనడా, జర్మనీ, మాల్దీవులు ఇక మీరు మా దేశాలకు నిరభ్యంతరంగా రావచ్చునని ప్రకటించాయి. ఇప్పటివరకు ఉన్న బ్యాన్ ఆంక్షలను బుధవారం నుంచి ఎత్తివేస్తున్నట్టు ఇవి వెల్లడించాయి. జర్మనీ అయితే ఇండియాతో బాటు నేపాల్, రష్యా, బ్రిటన్, పోర్చుగల్ దేశస్థులపై విధించిన బ్యాన్ ను ఎత్తివేస్తునట్టు తెలిపింది. ఇటీవలి వరకు ఈ దేశాలను వైరస్ వేరియంట్ కంట్రీ కేటగిరీ కింద ఉంచామని.. కానీ ఇప్పడు హై ఇన్సిడెన్స్ ఏరియాలుగా తిరిగి వర్గీకరించామని జర్మనీ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. అంతర్జాతీయ ట్రావెల్ ఆంక్షలను సడలించినట్టు ఈ సంస్థ వెల్లడించింది. కెనడా కూడా ఇదే చర్య తీసుకుంది. అయితే ఇండియా నుంచి నేరుగా వచ్చే విమానాలపై బ్యాన్ ఈ నెల 21 వరకు ఉంటుందని ఈ దేశ ప్రభుత్వం తెలిపింది.
అయితే కనెక్ట్ విమానాన్ని ఎంపిక చేసుకుని భారతీయులు వచ్చే వారం నుంచి తమ దేశానికి రావచ్చునని, కానీ కోవిద్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు ఉండాలని స్పష్టం చేసింది. కాగా మరికొన్ని దేశాలు కూడా క్రమంగా భారతీయులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. వాటి నుంచి అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ప్రధానంగా కెనడా, జర్మనీ దేశాల్లో ఉన్న తమ కుటుంబాలను కలుసుకునేందుకు ఇండియా నుంచి వెళ్ళడానికి సిద్ధమైన వారికి ఈ చల్లని కబురు ఎంతో ఊరటనిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి :జబర్దస్త్ వినోదిని కి పెళ్లి..! ఇంతకు ఆమె ఎవరు..?సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వినోద్ పెళ్లి ఫొటోస్ :Jabardasth Vinod Video.