ఆఫ్ఘనిస్తాన్ లో విజృంభిస్తున్న తాలిబన్లు …ప్రభుత్వం పై గురి..ప్రధాన నగరాలపై దాడులు.
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు విజృంభిస్తున్నారు. బాడ్గిస్ కి ప్రొవిన్షియల్ రాజధాని అయిన 'కలాయి-నా'పై బుధవారం ఒక్కసారిగా దాడికి దిగారు. నేరుగా ఆఫ్ఘన్ దళాలపై విరుచుక పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంతో బాటు దేశ గూఢఛార కార్యాలయాన్ని కూడా...
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు విజృంభిస్తున్నారు. బాడ్గిస్ కి ప్రొవిన్షియల్ రాజధాని అయిన ‘కలాయి-నా’పై బుధవారం ఒక్కసారిగా దాడికి దిగారు. నేరుగా ఆఫ్ఘన్ దళాలపై విరుచుక పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి పోలీసు ప్రధాన కార్యాలయంతో బాటు దేశ గూఢఛార కార్యాలయాన్ని కూడా వారు తమ హస్తగతం చేసుకున్నారు. అమెరికా, నేటో దళాలు ఆఫ్ఘన్ నుంచి చాలావరకు వైదొలగిన తరువాత వీరు డజన్ల కొద్దీ గ్రామీణ జిల్లాలను స్వాధీనం చేసుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఓ ప్రొవిన్షియల్ కేపిటల్ ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వారు దాడి జరపడం ఇదే మొదటిసారి. శతృవులు సిటీలో ప్రవేశించారని, అన్ని జిల్లాలు వారి వశమయ్యాయని..ఇక్కడ పోరు ఉధృతమైందని బాడ్గిస్ గవర్నర్ హేసాముద్దీన్ షమ మీడియాకు పంపిన టెక్స్ట్ మెసేజ్ లో తెలిపారు. ప్రొవిన్షియల్ కౌన్సిల్ అధికారులు భయంతో ఆర్మీ క్యాంపు దిశగా పారిపోయారని కౌన్సిల్ మెంబర్ ఒకరు తెలిపారు. సిటీ పోలీసు హెడ్ క్వార్ట్రర్స్ లోను, దేశ గూఢఛార కార్యాలయంలోనూ వారు తిష్ట వేశారని ఆమె చెప్పారు.
సుమారు 400 జిల్లాలు ఉన్న ఆఫ్ఘన్ లో చాలావరకు..దాదాపు పావు భాగం పైగా జిల్లాలు ఇప్పటికే తాలిబన్ల అధీనంలో ఉన్నాయి.ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే వారాల్లో ఆఫ్ఘన్ మొత్తాన్ని వీరు తమ కైవసం చేసుకుంటారేమోనని భయపడుతునాన్రు. తాజా పరిణామాలపపై అమెరికా గానీ మరే దేశం అనీ ఇంతవరకు స్పందించలేదు. కాబూల్ తదితర చోట్ల ఇంకా అమెరికా, ఇతర విదేశీ సైనిక దళాలు ఉన్నాయని, అవి కూడా స్వదేశాలకు తరలి వెళ్లాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : సూపర్ స్టార్ కు జోడిగా లేడీ సూపర్ స్టార్..?హ్యాట్రిక్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న మాటల మాంత్రికుడు..:nayanthara and mahesh babu Video.
వేరియంట్లపై వైద్యులకేం తెలుసు..? అంటూ మల్లిక్ సంచలన కామెంట్స్ ..:Paruchuri Mallik Video.