Andhra Pradesh: ఆఫ్ట్రాల్ ఫోన్ నంబర్ కోసం సూసైడ్ వరకూ వెళ్లాడు.. పిచ్చా..? వెర్రా..?
వినియోగదారుడు కొంతకాలం యూజ్ చెయ్యకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. దీంతో కంపెనీ ఆ నంబర్‌ను వేరేవాళ్లకు ఇస్తుంది. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్. తాజాగా...
వినియోగదారుడు కొంతకాలం యూజ్ చెయ్యకపోతే సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. దీంతో కంపెనీ ఆ నంబర్‌ను వేరేవాళ్లకు ఇస్తుంది. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రాసెస్. తాజాగా అలా తన నంబర్ కోల్పోయిన ఓ వ్యక్తి.. దాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ నంబర్ ప్రస్తుతం వినియోగిస్తున్న జడ్పీ కార్యాలయం వద్దకు వెళ్లి తన నంబర్ తనకు ఇస్తారా లేదా చనిపోమంటారా అంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బృందావన్ గార్డెన్స్‌కు చెందిన ఓ యువకుడు ఓ నెట్‌వర్క్‌కి చెందిన సిమ్ కార్డును గత కొంతకాలంగా ఉపయోగిస్తున్నాడు. కొన్నాళ్లుగా బిల్లు పే చెయ్యకపోవడంతో సదరు కంపెనీ వాళ్లు ఆ నంబర్‌ను డీఫాల్ట్ చేశారు. కొత్తగా నంబర్లు జారీ చేసే క్రమంలో ఆ నంబర్‌ను జిల్లాపరిషత్ కార్యాలయానికి(జడ్పీ) కేటాయించారు. తన సెల్‌ఫోన్ నంబర్ పని చేయకపోవడంతో ఆ యువకుడు… తన నంబరు వేరే వాళ్లకు జారీ అయిన విషయం తెలుసుకున్నాడు.
ఒంటిపై కిరోసిన్ పోసుకొని..
జడ్పీ కార్యాలయానికి వచ్చి.. తన నంబర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ గొడవ చేశాడు. ఉన్నతాధికారులు కార్యాలయం కోసం కొత్తగా సిమ్‌కార్డు తీసుకున్నారని, ఆ నంబర్‌ను తమకు కంపెనీ వాళ్లు ఇచ్చారని అక్కడి సిబ్బంది తెలిపారు. అయినా అతను వినకుండా తన నంబర్ ఇవ్వాలని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న డబ్బాలో కిరోసిన్‌ను శరీరంపై పోసుకున్నాడు. ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన జడ్పీ కార్యాలయ సిబ్బంది నగరంపాలెం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి చేతిలోని కిరోసిన్ డబ్బాను లాక్కొన్నారు. అతడికి నచ్చజెప్పి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఏం జరిగిందని వివరాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో తన నంబర్ ఇప్పించాలంటూ అతడు పోలీసులపై ఒత్తిడి చేయడంతో… కంపెనీ వాళ్లకు చెప్పి మంచి ఫ్యాన్సీ నంబర్ ఇప్పిస్తానని సీఐ బుజ్జగించి పంపించారు.
Also Read: అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..