NTR-Atlee Movie: తెలుగు లో అడుగు పెట్టనున్న రాజారాణి డైరెక్టర్ .. ఎన్టీఆర్ తో అట్లీ ప్రేమకథా చిత్రం

NTR-Atlee Movie: ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు వరస సినిమాలను అంగీకరిస్తూనే.. మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా..

NTR-Atlee Movie: తెలుగు లో అడుగు పెట్టనున్న రాజారాణి డైరెక్టర్ .. ఎన్టీఆర్ తో అట్లీ ప్రేమకథా చిత్రం
Ntr Atli
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2021 | 3:01 PM

NTR-Atlee Movie: ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు వరస సినిమాలను అంగీకరిస్తూనే.. మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరుడు షో ని చేయనున్నాడు. సర్వసాధారణంగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కి మాస్ ఇమేజ్ ఎక్కువ.. అందుకే ఎన్టీఆర్‌ ఎక్కువగా యాక్షన్ అండ్‌ ఎమోషన్ ఉన్న కథలను ఎంచుకుంటుంటారు. కథాకథనాలు ఏవైనా తన సినిమాల్లో ఆడియన్స్‌ ఇష్టపడే అంశాలను మిస్ కాకుండా చూసుకుంటారు. అలాంటి ఎన్టీఆర్ ఈసారి ఓ ప్యూర్‌ లవ్ స్టోరీ చేయడానికి రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎన్టీఆర్ తాజా చిత్రంగా ‘ఆర్ఆర్‌ఆర్‌’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత సినిమాను ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో చేయనుండగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే సడెన్‌గా అట్లీ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నడనే వార్త ఊపందుకుంది. అది కూడా ఓ అదిరిపోయే ప్రేమకథ నేపథ్యంలో సాగే మూవీ అని తెలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న ఈ ప్రేమకథకు.. యంగ్‌ టైగర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. కథకు అవసరమైన అన్ని హంగులు జోడిస్తున్నారని..ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పైనే అట్లీ కుమార్ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు.

ఇటీవలే అట్లీ జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రేమ కథను నెరేట్ కూడా చేశారట. ఇక అట్లీ చెప్పిన కథను విని ఎన్టీఆర్‌ ఆ స్టోరీని ఇష్టపడడమే కాకుండా.. పూర్తి స్క్రిప్ట్‌ను డెవలప్ చేయమని కోరారని తెలుస్తోంది. అలాగే రాజారాణి సినిమాతో సూపర్ హిట్‌ అందుకున్న అట్లీ.. ఎన్టీఆర్‌కు వివరించిన ప్రేమకథ కూడా అచ్చం అటువంటి జానర్‌లోనే ఉంటుందని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అట్లీ..షారుఖ్ ఖాన్‌తో కలిసి చేస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే.. ఎన్టీఆర్‌తో సినిమా మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Also Read: రాష్ట్రపతి భవన్‌ వేదికగా మంత్రులు ప్రమాణ స్వీకారం.. విస్తరణలో 27 మంది కొత్తవారికి ఛాన్స్! చిత్రాలు..

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో