Cyber crime: అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..

ఫుల్ రొమాన్స్, అంతకుమించిన ఆనందం అంటూ వల విసురుతారు. న్యూడ్ కాల్స్‌తో అవతలివారిని టెమ్ట్ చేస్తారు.  వాట్సప్‌ వీడియో కాల్స్‌ ద్వారా అవతల ఉన్నవారు కూడా నగ్నంగా...

Cyber crime:  అమ్మాయిల్లా మాట్లాడుతారు.. న్యూడ్ కాల్స్ కూడా చేస్తారు.. కనెక్ట్ అయ్యారో, కథ కంచికే..
Cyber Goons
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 07, 2021 | 3:41 PM

ఫుల్ రొమాన్స్, అంతకుమించిన ఆనందం అంటూ వల విసురుతారు. న్యూడ్ కాల్స్‌తో అవతలివారిని టెమ్ట్ చేస్తారు.  వాట్సప్‌ వీడియో కాల్స్‌ ద్వారా అవతల ఉన్నవారు కూడా నగ్నంగా ఉండగా వీడియోలు తీసి.. తర్వాత అసలు గేమ్ మొదలెడతారు. సదరు న్యూడ్ వీడియోలను ఉపయోగించి  బెదిరిస్తున్న కేటుగాళ్ల గుట్టు రట్టయింది. ఫేస్​బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని అనంతరం వాట్సప్‌ వీడియోల్లో  న్యూడ్‌గా మాట్లాడుతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించి డబ్బులు దండుకుంటున్న గ్యాంగ్‌ను తెలంగాణ పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌ భరత్‌పూర్‌కు చెందిన ముఠా.. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్‌ క్రైం పోలీసులు కనుగొన్నారు.  కనీసం 10వ తరగతి కూడా పాస్ కాని నేరగాళ్లు.. వేల మందిని బెదిరించి రెండు నెలల్లో 25 కోట్ల రూపాయలకు పైగా దండుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కంత్రీగాళ్ల ముఠా బాధితులు 18 రాష్ట్రాల్లో ఉన్నారంటే ఎంత మంది వీరి బారిన పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈ ముఠా కోసం ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నై పోలీసులు గాలిస్తున్నారు. ముఠాలో 18 మందిని హైదరాబాద్‌ పోలీసులు ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు.

పక్కా ప్లానింగ్‌తో….

సోషల్ మీడియాలో యువకులను ట్రాప్ చేసి..  ఫోన్‌లో అప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదానిని పంపుతున్నారు. పెదాల కదిలికలకు అనుగుణంగా వాయిస్‌ చేంజ్‌ యాప్‌ ద్వారా అమ్మాయిల్లా మాట్లాడుతున్నారు. ఒకటి రెండు రోజులు న్యూడ్ వీడియోల ద్వారా మాట్లాడిన తర్వాత… మీరు కూడా నగ్నంగా మాట్లాడండి అంటూ కోరుతున్నారు. బాధితుడు వీడియో కాల్‌ మొదలుపెట్టగానే అవతలి నుంచి నిందితుడు మరో కెమారాతో బాధితుడి మాటలు, విజువల్స్ రికార్డు చేస్తున్నాడు. వీడియోకాల్‌ పూర్తయిన అయిదు నిమిషాలకు… బాధితుడు మాట్లాడిన వీడియోను పంపి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక పరువుపోతుందనే భయంతో డిమాండ్‌ చేసినంత ముట్టజెప్పుతున్నారు. ఇలాగే సికింద్రాబాద్‌లో నివసించే ఈవెంట్‌ మేనేజర్‌… సైబర్‌ నేరస్థుల వేధింపులు తాళలేక పది లక్షల రూపాయలు నగదు బదిలీ చేశాడు. పది రోజుల్లో వివాహముందని, ఆ రోజున తన నగ్న వీడియోలను స్నేహితులు, భార్య, బంధువులు చూస్తే పరువు పోతుందన్న భయంతో 10 లక్షలు ముట్టజెప్పినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విధంగా అనేక మందిని కేటుగాళ్ల చిక్కులో పడి లక్షలు ఇచ్చుకుంటున్నారు.

Also Read: ‘మా’ ఎన్నికలు.. ఏకగ్రీవం కోసం సీనియర్ల ప్రయత్నాలు.. సరికొత్త చర్చకు తెరలేపిన ప్రకాష్ రాజ్ ట్వీట్..

గూడూరులో యువతిని చంపింది అతనే.. ప్రేమోన్మాది డ్రామాలకు చెక్ పెట్టిన పోలీసులు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే