Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్ల ఆహ్వానం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్లని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మకానికి రోడ్ మాప్

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్ల ఆహ్వానం.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Vizag Steel Plant
Follow us
uppula Raju

|

Updated on: Jul 08, 2021 | 12:19 AM

Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కి టెండర్లని ఆహ్వానిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మకానికి రోడ్ మాప్ సిద్ధం చేసింది. స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమాలను, అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంది. అమ్మకానికి షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ టెండర్లను ఆహ్వానించింది. జులై 7 వ తేదీ నుంచి బిడ్డింగ్ కూడా ప్రారంభించింది. ప్రి బిడ్ మీటింగ్ 15 న, బిడ్ సబ్మిషన్ లాస్ట్ డేట్ 28 వ తేదీ, 29 న టెక్నికల్ బిడ్‌లను ప్రకటించింది. ఎంపికైన కంపెనీ కి వెంటనే స్టీల్ ప్లాంట్ ని అప్పగించనుంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం పేర్కొంది. ఏపీలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. ఈ నోటిఫికేషన్ పై రేపు పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉంది.

1970 ఏప్రిల్ 17న విశాఖలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలని పార్లమెంటులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటన చేశారు. ప్లాంటు కోసం కురుపాం జమీందారులు 6,000 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ మరుసటి ఏడాది 1971 జనవరి 20న ప్లాంటు నిర్మాణానికి ఇందిర శంకుస్థాపన చేశారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ బాధ్యతను మెస్సర్స్ ఎం.ఎన్.దస్తూర్‌ అండ్ కో సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ 1977 అక్టోబర్‌లో తన నివేదిక ఇచ్చింది. 1977లో జనతా ప్రభుత్వం హయాంలో రూ. 1,000 కోట్లు మంజూరు చేయటంతో పనులు మొదలయ్యాయి.

ప్లాంటు నిర్మాణం కోసం సోవియట్ రష్యా సహకారం తీసుకుంటూ భారత ప్రభుత్వం 1981లో ఒప్పందం చేసుకుంది. 1990లో ఉక్కు ఉత్పత్తి ఆరంభమైంది. మరో రెండేళ్లకు పూర్తిస్థాయిలో పని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు 26,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్‌ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..

Janasena : జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్

Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..