Janasena : జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్
జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు...
Pawan kalyan: జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను పవన్ నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్‌కు ప్రతాప్, డాక్టర్ సెల్‌కు రఘు, ఐటీ సెల్‌కు శివరాం, చేనేత సెల్‌కు సుభాష్‌లను నియమించారు. రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా కల్యాణపు శ్రీనివాస్‌లను నియమిస్తూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే రాష్ట్రంలోని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. కాగా, కరోనా కారణంగా మూడు నెలల పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ తొలిసారిగా బుధవారం విజయవాడ వచ్చారు. పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలు- కోవిడ్ నియంత్రణ- జాబ్ క్యాలెండర్- ఇతర ప్రజా సమస్యలపై చర్చించారు.
తాడేపల్లిలో.. ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డి నివాసం దగ్గర పేదల ఇళ్ల తొలగింపు వ్యవహారంపైనా మాట్లాడారు. మీరక్షణ సంగతి సరే.. ముప్పై ఏళ్లకు పైగా.. ఇక్కడ నివసించిన వారికి ప్రత్యామ్నయం చూపించి.. వాళ్ల ఇళ్లను తొలగించాలని సూచించారు. కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను పంచారు. పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు మంగళగిరి కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Read also: Fake Documents: అసైన్డ్ భూములకు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి స్థలాలను విక్రయించే కేడీ బ్యాచ్