AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..

Cabinet Expansion 2021: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో

Cabinet Expansion 2021: పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి..
Cabinet Expansion
uppula Raju
|

Updated on: Jul 08, 2021 | 12:28 AM

Share

Cabinet Expansion 2021: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు ఉన్నారు. ఇందులో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డికి కేబినెట్‌ హోదా లభించింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి పనిచేయడం ద్వారా బలమైన, సంపన్న భారత నిర్మాణానికి కృషిచేద్దామని పిలుపునిచ్చారు. తాజాగా మంత్రుల కేటాయింపు ఇలా జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీ – ప్రధానమంత్రి, శాస్త్ర సాంకేతిక, సిబ్బంది వ్యవహరాలు, పబ్లిక్‌ గ్రీవెన్స్‌, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్షశాఖ, వివిధ పథకాలు, ఇతరులకు కేటాయించని మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించనున్నారు.

కేబినెట్‌ మంత్రులు- వారి శాఖలు

1. రాజ్‌నాథ్‌ సింగ్‌ – రక్షణ శాఖ

2. అమిత్‌ షా- హోంమంత్రిత్వ శాఖ, సహకార శాఖ

3. నితిన్‌ గడ్కరీ- రహదారులు, రవాణా శాఖ

4. నిర్మలా సీతారామన్‌- ఆర్థిక శాఖ, కార్పొరేట్‌ వ్యవహరాలు

5. నరేంద్ర సింగ్‌ తోమర్‌- వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ

6. సుబ్రహ్మణ్యం జయశంకర్‌- విదేశీ వ్యవహారాలు

7. అర్జున్‌ ముండా- గిరిజన వ్యవహారాలు

8. స్మృతి ఇరానీ- మహిళా, శిశుసంక్షేమశాఖ

9. పీయూష్‌ గోయల్‌ – వాణిజ్యం, పరిశ్రమలు, అదనంగా జౌళిశాఖ, ఆహార, ప్రజా పంపిణీ

10. ధర్మేంద్ర ప్రధాన్‌ – విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ

11. ప్రహ్లాద్‌ జోషీ – పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ

12. నారాయణ్‌ రాణే – చిన్న, మధ్యతరహా పరిశ్రమలు

13. శర్వానంద సోనోవాల్‌- ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ

14. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాలు

15. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌ – సామాజిక న్యాయం, సాధికారత

16. గిరిరాజ్ సింగ్‌ – గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

17. జ్యోతిరాదిత్య సింధియా- పౌర విమానయాన శాఖ

18. రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ – ఉక్కు శాఖ

19. అశ్వినీ వైష్ణవ్‌ – రైల్వే, ఐటీ కమ్యూనికేషన్లు

20. పశుపతి కుమార్‌ పారస్‌ – ఫుడ్‌ ప్రాసెసింగ్‌

21. గజేంద్రసింగ్ షెకావత్‌ – జల్‌శక్తి

22. కిరణ్‌ రిజిజు – న్యాయశాఖ

23. రాజ్‌కుమార్‌ సింగ్‌ – విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన శాఖ

24. హర్‌దీప్‌ సింగ్‌ పూరీ – పట్టణ అభివృద్ధి, పెట్రోలియం శాఖ

25. మన్‌సుఖ్‌ మాండవీయ – ఆరోగ్యశాఖ, రసాయనాలు, ఎరువులు

26. భూపేంద్ర యాదవ్‌ – పర్యావరణ, అటవీ, ఉపాధి, కార్మిక శాఖ

27. మహేంద్రనాథ్‌ పాండే – భారీ పరిశ్రమల శాఖ

28. పురుషోత్తం రూపాల – డెయిరీ, మత్స్య శాఖ, పశుసంవర్థక శాఖ

29. కిషన్‌రెడ్డి – పర్యాటక, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

30. అనురాగ్‌ఠాకూర్‌ – సమాచార-ప్రసారాలు, యువజన వ్యవహారాలు, క్రీడలు

స్వతంత్ర హోదా- శాఖలు

1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌- గణాంకాలు, ప్రణాళిక, కార్పొరేట్‌ వ్యవహరాలు

2. డా. జితేంద్ర సింగ్‌- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్‌, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ

సహాయ మంత్రులు- వారి శాఖలు

1. శ్రీపాద యశోనాయక్‌-  ఓడ రేవులు, షిప్పింగ్‌, పర్యాటక శాఖ

2. ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే- ఉక్కు, గ్రామీణాభివృద్ధి

3. ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌- జల్‌శక్తి, ఆహార శుద్ధి

4. అశ్వినీ కుమార్‌ చౌబే- వినియోగదారుల వ్యవహరాలు, ఆహార, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ శాఖ

5. అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌- పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ

6. వీకే సింగ్‌- రవాణా, రహదారులు, పౌరవిమానయానశాఖ

7. కృష్ణన్‌ పాల్‌-విద్యుత్‌, భారీ పరిశ్రమలు

8. దన్వే రావుసాహెబ్‌ దాదారావు- రైల్వే, బొగ్గు, గనులు

9. రామ్‌దాస్‌ అథవాలే- సామాజిక న్యాయం, సాధికారత

10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి- వినియోగదారుల వ్యవహహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, గ్రామీణాభివృద్ధి

11. సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌- మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ

12. నిత్యానంద రాయ్‌- హోం శాఖ

13. పంకజ్‌ చౌదరీ- ఆర్థిక శాఖ

14. అనుప్రియ సింగ్‌ పటేల్‌- వాణిజ్య, పరిశ్రమల శాఖ

15. ఎస్పీ సింగ్‌ బఘేల్‌- న్యాయశాఖ

16. రాజీవ్‌ చంద్రశేఖర్‌- నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ

17. శోభా కరంద్లాజే – వ్యవసాయం, రైతు సంక్షేమం

18. భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ- సూక్ష్మ, చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖ

19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌-  రైల్వే, జౌళీ శాఖ

20. మురళీధరన్‌- విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ

21. మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖౌ

22. సోం పర్‌కాశ్‌- వాణిజ్యం, పరిశ్రమల శాఖ

23. రేణుకా సింగ్‌- గిరిజన వ్యవహారాలు

24. రామేశ్వర్‌ తేలి- పెట్రోలియం,నేచురల్‌ గ్యాస్‌, ఉపాధి, కార్మికశాఖ

25. కైలాస్‌ చౌదరీ- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ

26. అన్నపూర్ణ దేవి- విద్యాశాఖ

27. నారాయణ స్వామి- సామజిక న్యాయం, సాధికారత

28. కౌశల్‌ కిశోర్‌- గృహ, పట్టణ వ్యవహారాల శాఖ

29. అజయ్‌ భట్‌- రక్షణ, పర్యాటకం

30. బీఎల్‌ వర్మ-  ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకార శాఖ

31. అజయ్‌ కుమార్‌- హోంశాఖ

32. దేవ్‌సిన్హ్‌ చౌహాన్‌- కమ్యూనికేషన్ల శాఖ

33. భగవంత్‌ ఖుబా- పునరుత్పాదక శక్తి, రసాయనాలు, ఎరువుల

34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్- పంచాయతీ రాజ్‌

35. ప్రతిమా భౌమిక్‌- సామాజిక న్యాయం, సాధికారత

36. సుభాశ్‌ సర్కార్‌- విద్యాశాఖ

37. భగవత్‌ కిషన్‌రావు కరడ్‌- ఆర్థిక శాఖ

38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌- విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ

39. భారతీ ప్రవీణ్‌ పవార్‌- ఆరోగ్యం, కుటంబ సంక్షేమం

40. బిశ్వేశ్వర్‌ తుడు- గిరిజన వ్యవహరాలు, జల్‌ శక్తి

41. శాంతను ఠాకూర్‌- పోర్టులు, షిప్పింగ్‌, జలరవాణా

42. ముంజపర మహేంద్రభాయ్‌- ఆయూష్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ

43. జాన్‌ బర్లా-మైనారిటీ వ్యవహారాలు

44. ఎల్‌. మురుగన్‌- పాడి, పశుసంవర్థక, మత్య్స, సమాచార, ప్రసారశాఖ

45. నిషిత్‌ ప్రామాణిక్‌- హోంశాఖ, యువజన, క్రీడా శాఖ

Janasena : జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్

Hyderabad: హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..

Post Office Saving Account: పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా… ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!