Almonds for Diabetes: డయాబెటిక్ పేషెంట్స్‌కి గుడ్‌న్యూస్.. బాదంతో మహమ్మారికి చెక్.. ఎలా అంటే..
Almonds for Diabetes, Cholesterol: ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో.. అనారోగ్య సమస్యలు పెను సవాలుగా మారాయి. దాదాపు 40 ఏళ్లుగా ప్రపంచం మొత్తం డయాబెటిక్ సమస్యతో సతమతమవుతోంది. ఈ మాయదారి
Almonds for Diabetes, Cholesterol: ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో.. అనారోగ్య సమస్యలు పెను సవాలుగా మారాయి. దాదాపు 40 ఏళ్లుగా ప్రపంచం మొత్తం డయాబెటిక్ సమస్యతో సతమతమవుతోంది. ఈ మాయదారి మధుమేహ రోగం బారిన పడుతున్న వారి సంఖ్య ప్రస్తుతం నాలుగు రేట్లు పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. భారతదేశంలో కూడా ఈ వ్యాధి వ్యాప్తి నానాటికి పెరుగుతూనే ఉంది. పెద్దా.. చిన్నా అని తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడి కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇలా క్రమంగా మేధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో.. వ్యాధి నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ప్రీ-డయాబెటిక్, టైప్ 2 డయాబెటిక్ బారిన పడిన వారు.. ఆ వ్యాధులకు దూరంగా ఉండాలనుకునే వారు.. చాలామంది తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలను పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఏం తినాలన్నా.. తాగాలన్నా ముందు వెనుక ఆలోచించాల్సి వస్తోంది. స్నాక్స్ నుంచి ఆహారం వరకూ అన్ని నియమాలు పాటించాల్సి వస్తోంది.
ఈ క్రమంలో డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారికి.. ఓ గుడ్‌న్యూస్ వచ్చింది. ప్రీడయాబెటిక్‌తో బాధపడుతున్న యువకుల్లో.. బ్లడ్‌లో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడానికి బాదం మేలు చేస్తుందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఫ్రంట్‌లైన్స్ ఇన్ న్యూట్రిషన్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు సార్లు బాదం తినడం వల్ల యువతలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయి మెరుగుపడటంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుందని వెల్లడైంది. దీంతోపాటు హెచ్‌బీఏ1సీ వృద్ధి చెందడంతోపాటు ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుందని పేర్కొంది.
అయితే.. బాదం తినడం వల్ల ప్రీ డయాబెటీస్‌తో బాధపడుతున్న కౌమారదశ బాలల్లో, యువతలో గ్లూకోజ్ స్థాయిలు వృద్ధి చెందుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. దీంతోపాటు చెడు కొలెస్ట్రాల్‌ను సైతం నియంత్రించి ఆరోగ్యవంతం చేయడంలో సహాయకారిగా ఉంటుంది. అధ్యయనంలో వెల్లడించారు. జీవనశైలిని మార్పు చేసుకోవడం ద్వారా ఈ ధోరణిని అడ్డుకోవచ్చని తేల్చారు. మెరుగైన పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు నిత్యం నడక, వ్యాయామాలు తోడ్పాటునందిస్తాయని అధ్యయనం తెలిపింది. జీవనశైలి మార్పుల వల్ల ప్రధానంగా ప్రీ డయాబెటీస్ నుంచి టైప్ 2 డయాబెటస్‌గా మారడాన్ని నియంత్రించవచ్చని నిర్ధారణ అయింది.
ఈ అధ్యయనం.. 16-25 ఏళ్ల.. 216 మంది యువతులు, 59 మంది యువకులపై కొనసాగింది. ప్రీ-డయాబెటిస్ ఉన్న మొత్తం 275 మందికి బాదం డైట్‌తో పరిశోధనలు జరిపారు. 56 గ్రాముల (340 కేలరీలు) బాదంపప్పులను మూడు నెలలపాటు.. రోజుకు రెండుసార్లు అందించారు. అయితే వీటిని ఇతర ఆహార పదార్థాలతో అందించారు. అధ్యయనంలో.. బరువు, ఎత్తు, నడుము చుట్టుకొలతలను పరిశీలించారు. పాస్ట్, పోస్ట్ రక్త నమూనాలను పరిశీలించారు. గ్లూకోస్ టాలరెన్స్, లిపిడ్ ప్రొఫైల్స్‌ను కూడా అంచనా వేసి బాదం మేలు చేస్తుందని అధ్యయనంలో వెల్లడించారు.
ముంబైలోని సర్ వితాల్డిస్ థాకెర్సీ కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ న్యూట్రిషనిస్ట్, ప్రొఫెసర్, ప్రధాన పరిశోధకుడు డాక్టర్ జగ్మీత్ మదన్ మాట్లాడుతూ.. మధుమేహం.. టీనేజ్, యువకులను సైతం లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. మెరుగైన ఆరోగ్యం డయాబెటిక్ సమస్యను ఎదుర్కొనేందుకు జీవనశైలిలో మార్పులు అవసరమన్నారు. బాదంతో జరిపిన అధ్యయనంలో కేవలం 12 వారాల్లోనే మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రిడియాబెటిక్ నుంచి టైప్ -2 డయాబెటిక్‌కు మారే ప్రక్రియను బాదం నియంత్రిస్తుందని తెలిపారు. అయితే.. ఈ అధ్యయనం కాలిఫోర్నియా మెర్సిడ్ విశ్వవిద్యాలయం, ఆల్మాండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా ఆధ్వర్యంలో జరిగింది.
Also Read: