Sleep Tips: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా ? నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే…
ప్రస్తుతం హడావిడి జీవిన శైలిలో విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడం లేదు చాలా మంది. ముఖ్యంగా సరైన నిద్ర చాలా మందిలో ఓ వెలితిగానే ఉంటుంది.
ప్రస్తుతం హడావిడి జీవిన శైలిలో విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వడం లేదు చాలా మంది. ముఖ్యంగా సరైన నిద్ర చాలా మందిలో ఓ వెలితిగానే ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్ ప్రభావం.. పని ఒత్తిడి మెదడుపై అధిక ప్రభావం చూపిస్తుంటాయి. ఫలితంగా నిద్రలేమి సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. అలాగే నిరసం, అలసటగా అనిపించడం.. తీవ్రమైన తలనొప్పి.. చేస్తున్న పనిపై ఆసక్తి లేకపోవడం. జరుగుతుంటుంది. ఇక కరోనా కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది. సాధారణంగా మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. కానీ ప్రస్తుతం చాలా మందిలో సరైన నిద్రలేకపోవడం జరుగుతుంది. నిద్ర లేకపోతే.. మానసికంగా మార్పులు, డిప్రెషన్, బరువు పెరగడం, మతిమరుపు, రక్తపోటు, గుండె వ్యాధులు, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే మంచి నిద్ర కోసం నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సంస్థ నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవెంటో తెలుసుకుందాం.
1. రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం.. ఓకే సమయంలో లేవడం అలవాటు చేసుకోండి. మొదట్లో కాస్తా ఇబ్బందిగా అనిపించిన క్రమంగా అలవాటుగా మారిపోతుంది. 2. మంచి నిద్రకు ముఖ్యంగా మీరు నిద్రపోయే స్థలం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. అలాగే మీరు ఉపయోగించే దుప్పట్లు, దిండ్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పడుకునే చోట సువాసనగల కొవ్వొత్తులను వెలిగించుకోవాలి. 3. సాయంత్రం, రాత్రిళ్లు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. ఇందులో ఉండే కెఫిన్ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే నిద్రకు ముందు మద్యం సేవించడం.. సిగరేట్ కాల్చడం.. స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్ వాడడం మానుకోవాలి. ఇవి మీ నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. 4. మీరు నిద్రపోయే స్థలం ఎంతో ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మీ శ్వాసపై దృష్టి పెట్టడం వలన ఎలాంటి ఆలోచనలు రాకుండా హాయిగా నిద్రపోతారు.
Also Read: జమ్మూలో ఐఏఎఫ్ పై డ్రోన్ల దాడి ఘటన..బాంబులు పాకిస్తాన్ ఆయుధాగారంలో తయారైనవే ? ఫోరెన్సిక్ నివేదిక