Healthy Food: ఆరోగ్యం మన చేతుల్లోనే.. రోజూ తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం..!
Healthy Food: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, తినే..
Healthy Food: ప్రస్తుతమున్న రోజుల్లో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే మానసిక ఒత్తిళ్లు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి, తినే ఆహారం తదితర కారణాల వల్ల చాలా మంది ఆనారోగ్యానికి గురవుతున్నారు. విషయంలో కొన్నింటిని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశ్యంతో చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఎక్కువ ఖర్చు చేసి ఏవేవో ఫుడ్‌ను తీసుకుంటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు. వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. వీటిని ప్రతి రోజు తినే ఆహారంలో చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
పెరుగు:
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఎంతో మెరుగు పడుతుంది. ఇందులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తాయి. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
మిల్లెట్లు:
మన పూర్వ కాలంలో పెద్దలు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు చాలాకాలం ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్‌లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటంలో ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది మంచి ఆహారం.
మసాలా దినుసులు:
మన వంట్లో మసాలా దినుసులు ఇండటం తప్పనిసరి. ప్రతి కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఎంతో ఖర్చు పెట్టేదానికంటే మన ఇంట్లోనే దొరికే వాటితోనే మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
పప్పు దినుసులు:
మనం ఎక్కువగా తినే పప్పుదినుసుల్లో అనేక ప్రయోజనాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ లాంటివి పుష్కలంగా లభిస్తాయి.