AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mouth Ulcers: నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? సమస్యకు తక్షణమే చెక్ పెట్టేయండిలా..

Mouth Ulcers: కడుపులో వేడి ఎక్కువగా ఉండడం వల్ల నోటి పూత సమస్య వస్తుంది. అలాగే మితిమీరిన మసాలా ఆహారం, కడుపు నొప్పి, మలబద్ధకం కారణంగా కూడా నోటి పూత తరచుగా సంభవిస్తుంది. కొన్ని సార్లు నోటి పుండ్లు హార్మోన్ల అసమతూల్యత, పీరియడ్స్ వంటి ఇతర కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే ఈ సమస్యను ఎలా నివారించాలో తెలుసా..? తెలుసుకుందాం..

Mouth Ulcers: నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? సమస్యకు తక్షణమే చెక్ పెట్టేయండిలా..
Mouth Ulcers
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 22, 2023 | 7:58 AM

Share

Mouth Ulcers: నోటి పూత అనేది సర్వసాధారణ సమస్య. సమస్యతో ఆరోగ్యానికి ప్రమాదం లేకపోయినప్పటికీ తినడానికి , తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కడుపులో వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే మితిమీరిన మసాలా ఆహారం, కడుపు నొప్పి, మలబద్ధకం కారణంగా కూడా నోటి పూత తరచుగా సంభవిస్తుంది. కొన్ని సార్లు నోటి పుండ్లు హార్మోన్ల అసమతూల్యత, పీరియడ్స్ వంటి ఇతర కారణాల వల్ల సంభవించవచ్చు. అయితే ఈ సమస్యను ఎలా నివారించాలో తెలుసా..? తెలుసుకుందాం..

  1. నోటి పూత సమస్యను నయం చేసేందుకు ఆహారంలో మార్పులు అవసరం. ఈ సమయంలో మీరు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకుంటే కడుపులోని సమస్యలు దూరమవుతాయి. ఫలితంగా సమస్య దూరమై పోతుంది.
  2. చెంచా ధనియాల పొడిని నీటిలో వేసి మరిగించి తాగినా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. సమస్య ఉన్న సమయంలో రోజుకు 3 సార్లు ఇలా తాగితే చాలు.
  3. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున ఇది కూడా నోటి అల్సర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కావాలంటే, తేనెను నేరుగా నోటి పుండ్లపై పూయవచ్చు.
  4. ఏలకుల పొడిని తేనెతో కలిపి అల్సర్ల మీద రాయడం ద్వారా కూడా తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఏలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున మీరు ఇలా రోజుకు రెండు సార్లు చేసినా సరిపోతుంది.
  5. మల్లె మొక్క ఆకులు కూడా నోటి పూత సమస్య నివారణలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇందు కోసం మల్లె మొక్క ఆకుల రసాన్ని నోటి పుండ్లపై అప్లై చేస్తే సరిపోతుంది.
  6. నోటి పూత నివారణ కోసం వెన్నె లేదా నెయ్యిని కూడా ఉపయోగించవచ్చు. నోటి పుండ్లపై వెన్నె లేదా నెయ్యిని రోజులో 4 సార్లు రాస్తే సరిపోతుంది.
  7. కొబ్బరి నూనె కూడా నోటి పూత సమస్య నివారణకు చక్కని ఎంపిక. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, గాయాలను తగ్గించడంలో సహాయపడతాయి.

వీటితో పాటు నిత్యం తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు కూడా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్ల నుంచి లభించే పోషకాలు శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అనేక సమస్యల నివారణలో కీలకంగా పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!