Skincare Tips: ముఖంపై ముడతలు, మొటిమలు కనిపిస్తున్నాయా..? బొప్పాయిని ఇలా వాడారంటే మెరిసే చర్మం మీదే..!

Skincare Tips: చర్మ సంరక్షణలో బొప్పాయి చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలోని ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగా బొప్పాయిని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలతో పాటు ముడతలు కూడా తొలగిపోతాయి.  మరి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో..

Skincare Tips: ముఖంపై ముడతలు, మొటిమలు కనిపిస్తున్నాయా..? బొప్పాయిని ఇలా వాడారంటే మెరిసే చర్మం మీదే..!
Papaya For Skin
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 21, 2023 | 1:14 PM

Skincare Tips: తమ చర్మం ఆకర్షణీయంగా, మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే తీసుకునే ఆహారం, జీవన శైలి కారణంగా చర్మ సంరక్షణ అనేది పెద్ద సవాలుగా మారిపోయింది. ఈ క్రమంలోనే  చాలా మంది చిన్నతనం నుంచే వృద్ధాప్య లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. బొప్పాయిలోని ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్ వంటి పోషకాలతో పాటు యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఈ కారణంగా బొప్పాయిని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలతో పాటు ముడతలు కూడా తొలగిపోతాయి.  మరి బొప్పాయిని ఎలా ఉపయోగించాలో తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం..

  1. బొప్పాయి, అవకాడో ప్యాక్: మెరిసే చర్మం కోరుకునేవారు బొప్పాయి, అవకాడోతో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇందుకోసం ఒక అవకాడో, బొప్పాయి ముక్కలను పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం దాన్ని ముఖం, మెడపై ప్యాక్ రూపంలో అప్లై చేసుకోవాలి. దీన్ని చర్మంపై 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల మీ ముఖంలో సహజమైన మెరుపు వస్తుంది.
  2. బొప్పాయి, కొబ్బరి నూనె పేస్ట్: కొబ్బరి నూనెకు చర్మ సమస్యలను దూరం చేయగల శక్తి ఉంది. ఈ క్రమంలో మీరు బొప్పాయి మెత్తగా చేసి కొబ్బరి నూనెలో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత దీన్ని ముఖం, మెడపై అప్లై చేసి 20 నిముషాల పాటు వదిలేయాలి. ఆపై చల్లని నీటితో కడిగిస్తే సరిపోతుంది. ఇలా వారంలో 2 సార్లు చేస్తే ముడతలు తొలగిపోతాయి.
  3. బొప్పాయి, పసుపు పేస్ట్: చర్మ సంరక్షణలో పసుపుకు ప్రముఖ స్థానం ఉంది. ఇక ముడతలను పోట్టుకునేందుకు బొప్పాయి పేస్ట్‌లో పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని ముఖం, మెడపై అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముడతలు తొలగిపోయి చర్మం మెరిసి పోతుంది.

కాగా, ముడతలు లేని మెరిసే చర్మం కోసం బొప్పాయి మాస్క్‌తో పాటు నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారంలో విటమిన్ ఇ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి చర్మ సంరక్షణలో కీలకంగా పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి