Andhra Pradesh: విజయ దశమి నుంచి విశాఖ నుంచే పాలన.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని, ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించింది. అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని, విరమణ తర్వాత కూడా పిల్లల చదువులకు ఫీజు రియింబర్స్‌మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా..
అమరావతి, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విజయ దశమి నుంచి విశాఖపట్నం నుంచి ప్రభుత్వ పాలనను ప్రారంభించాలని, అప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించాలని కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ కేబినెట్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులకు వరాలను కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఆమోదం తెలపడంతో పాటు, ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని, ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయించింది. అలాగే రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్ అయ్యేలా చూడాలని, విరమణ తర్వాత కూడా పిల్లల చదువులకు ఫీజు రియింబర్స్‌మెంట్ కింద కూడా ప్రయోజనాలు అందేలా చూడాలని, ఇందుకు కావాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించింది.
ఇవే కాక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్ ఉండేలా చట్ట సవరణ, ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్ సర్టిఫికేషన్, ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా ఈ చర్యలు వంటి పలు మార్పులను చేయడం వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలా మొత్తం 49 అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్.. ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం పనితీరు, ఆంధ్రప్రదేశ్ ఆధార్ సవరణ బిల్లు, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు వంటి వాటిపై చర్చించిందని సమాచారం.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..