Health Tips: పీరియడ్స్ సమయానికి రావట్లేదా..? మీ డైట్‌లో ఈ ఆహారాలు ఉంటే చాలు, సమస్యకు చెక్ పెట్టినట్లే..
Health Tips: మహిళల ఆరోగ్యాన్ని పీరియడ్స్ ప్రభావితం చేయగలవు. సమయానికి పీరియడ్స్ రాకపోతే వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మీకు కూడా ఈ రకమైన సమస్య ఉన్నట్లయితే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అయితే అంతకంటే ముందు శరీరానికి కావలసిన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడమే కాక పీరియడ్స్ సమయానికి వస్తాయి.
Updated on: Sep 22, 2023 | 9:21 AM

బొప్పాయి: మహిళలు బొప్పాయి తినడం వల్ల వారి పీరియడ్స్ సమయానికి వస్తాయి. బొప్పాయిలోని కెరోటిన్ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచి, పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేస్తుంది.

అల్లం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగిన అల్లం కూడా మహిళలకు సమయానికి పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అల్లం గర్భాశయం సంకోచాన్ని ప్రోత్సహించడమే కాక నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

సిట్రస్ పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సిట్రస్ పండ్లలో ఉండే పోషకాలు మహిళల శరీరంలోని ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచడమే కాక సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.

ఖర్జూరం: ఖర్జూరంలో ఉండే వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని పోషకాలు పీరియడ్స్ సమయానికి వచ్చేలా చేయడంతో పాటు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అలాగే.. స్ట్రెస్, అధిక వ్యాయమాలు, అధిక బరువు, గర్భ నిరోధక మాత్రలు వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా సమయానికి పీరియడ్స్ వస్తాయి.





























