IND vs AUS: నేడే భారత్-ఆస్ట్రేలియా తొలి వన్డే.. ప్రమాదంలో పాకిస్తాన్ నెం.1 ర్యాంక్.. ప్లేయింగ్ ఎలెవన్ వివరాలివే..
IND vs AUS 1st ODI: వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ చివరి సిరీస్‌లో పరస్పరం తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరిగే 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగే నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధంగా
IND vs AUS 1st ODI: వరల్డ్ కప్ 2023 టోర్నీ ప్రారంభానికి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ చివరి సిరీస్‌లో పరస్పరం తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు జరిగే 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగే నేటి మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధంగా ఉన్నాయి. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండడంతో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపిస్తుండగా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో జట్టుకు దూరమైన ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తిరిగొచ్చాడు. ఇక భారత్ తొలి రెండు వన్డేలను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా లేకుండానే ఆడుతుండగా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లేకుండా ఆసీస్ నేటి మ్యాచ్ ఆడనుంది.
ఇదిలా ఉండగా.. వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి. ఇరు జట్లు ఇప్పటివరకు 146 మ్యాచ్‌లు ఆడగా.. 82 ఆసీస్, 54 భారత్ గెలిచించి. మిగిలిన 10 మ్యాచ్‌ల్లో ఫలితం తలలేదు. వీటిల్లో భారత్‌లో ఆడిన మ్యాచ్‌లే 67 ఉండగా.. ఇక్కడ కూడా కంగారులదే అధిపత్యం. భారత్ వేదిగా జరిగిన 67 మ్యాచ్‌ల్లో 32 ఆసీస్, 30 టీమిండియా గెలవగా.. మరో 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
Excitement Levels High 📈
CAN. NOT. WAIT for #INDvAUS to begin ⏳#TeamIndia pic.twitter.com/g9GsKird7y
— BCCI (@BCCI) September 21, 2023
కాగా, నేటి నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ భారత్‌కి చాలా కీలకం కానుంది. ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన విజయోత్సాహంలో ఉన్న టీమిండియా.. ఆసీస్ వంటి దూకుడు స్వభావం కలిగిన జట్టుపై కూడా గెలిస్తే వరల్డ్ కప్ టోర్నీ కోసం బూస్టింగ్ లభించినట్లే అవుతుంది. అలాగే నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే వన్డే ఫార్మాట్‌లో నెం.1 ర్యాంక్ సాధిస్తుంది. ప్రస్తుతం 115 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా.. 115 పాయింట్లతోనే భారత్ రెండో స్థానంలో ఉంది. మరోవైపు భారత్ ఇప్పటికే టెస్ట్, టీ20 ర్యాకింగ్స్‌లో నెం.1 స్థానంలో ఉంది. భారత్ కనుక నేటి మ్యాచ్‌లో గెలిచి వన్డే నెం.1 జట్టుగా నిలిస్తే.. మూడు ఫార్మాట్లలోనూ ఒకే సమయంలో అగ్రస్థానంలో నలిచిన తొలి జట్టుగా అవతరిస్తుంది.
భారత్ vs ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్..
మొదటి వన్డే – 22 సెప్టెంబర్ – మొహాలీ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
రెండవ వన్డే – 24 సెప్టెంబర్ – ఇండోర్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
మూడో వన్డే – 27 సెప్టెంబర్ – రాజ్‌కోట్ – మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం
ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు(అంచానా):
భారత్: శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కామెరూన్ గ్రీన్, సీన్ అబాట్, పాట్ కమిన్స్ (సి), ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..