Foods for Thyroid: థైరాయిడ్ కంట్రోల్ చేయాలా.. ఈ ఫుడ్స్ తింటే తగ్గాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ సమస్య కూడా ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ అనేది ఇప్పుడు కామన్‌ సమస్యగా మారింది. ఈ థైరాయిడ్ ముప్పు మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. ప్రతీ 8 మందిలో ఒకరు థైరాయిడ్‌తో బాధ పడుతున్నారట. ప్రస్తుతం మారి జీవన శైలి కూడా థైరాయిడ్ రావడానికి ఒక కారణమని ఆరోగ్య నిపుణులు..

Foods for Thyroid: థైరాయిడ్ కంట్రోల్ చేయాలా.. ఈ ఫుడ్స్ తింటే తగ్గాల్సిందే!
Thyroid
Follow us

|

Updated on: Sep 05, 2024 | 6:03 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ సమస్య కూడా ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ అనేది ఇప్పుడు కామన్‌ సమస్యగా మారింది. ఈ థైరాయిడ్ ముప్పు మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. ప్రతీ 8 మందిలో ఒకరు థైరాయిడ్‌తో బాధ పడుతున్నారట. ప్రస్తుతం మారి జీవన శైలి కూడా థైరాయిడ్ రావడానికి ఒక కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్.. ఎక్కువగా ఉత్పత్తి చేయడమో లేకపోతే అస్సలు ఉత్పత్తి చేయక పోవడమో జరగడం వల్లనే ఈ ఇబ్బంది అనేది మొదలవుతుంది. థైరాయిడ్ ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తలు పాటించాలి. చికిత్స తీసుకుంటే సరైన ఆహార నియమాలు పాటిస్తే.. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి:

థైరాయిడ్‌తో బాధ పడేవారు ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

ఉసిరి:

థైరాయిడ్‌తో బాధపడేవారు ఉసిరి తినడం వల్ల చాలా మంచిది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరిని ఎలా తీసుకున్నా మంచిదే. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడంలో ఉసిరి సహాయ పడుతుంది. నేరుగా ఉసిరిని తినలేని వారు ఎలాగైనా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్రెజిలియన్ బీటెన్ నట్:

థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయాలంటే సెలీనియం చాలా అవసరం. టీ4ని టీ3గా మార్చడంలో సెలీనియం అవసరం. రోజుకు మూడు బ్రెజిలియన్ బీటెన్ నట్స్ తినడం వల్ల థైరాయిడ్ గ్రంధి పని తీరు మెరుగు పడుతుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం 4 నట్స్ అయినా తీసుకోండి.

గుమ్మడి గింజలు:

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్‌లు మెండుగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి, నియంత్రణకు సహాయ పడతాయి.

కొబ్బరి:

కొబ్బరి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్ ఉన్నవాళ్లు కొబ్బరి తినడం వల్ల ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. కొబ్బరిలో ఉండే పోషకాలు.. జీవక్రియను మెరుగు పరిచి, థైరాయిడ్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

పెసలు:

థైరాయిడ్‌తో బాధ పడేవాళ్లు పెసలు తినడం వల్ల కూడా మంచిదే. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంధి పనితీరుకు చక్కగా సహాయ పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..