AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tours: భూతల స్వర్గం కశ్మీర్‌కు ఎగిరిపోదామా.. తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ..

సినిమాల్లో కనిపించే సుందర కాశ్మీరాన్ని నిజంగా చూడాలనుకునేవాళ్లకు ఐఆర్ సీటీసీ మంచి అవకాశం కల్పించింది. కొత్తగా ఆరు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి ప్యారడైజ్ ఆన్ ఎర్త్ - కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది. బెంగళూరు నుంచి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లు చేసింది. చక్కగా విమానంలో వెళ్లి కాశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు.

IRCTC Tours: భూతల స్వర్గం కశ్మీర్‌కు ఎగిరిపోదామా.. తక్కువ ధరకే ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ..
Kashmir Tour
Madhu
|

Updated on: Sep 05, 2024 | 6:27 PM

Share

దేశంలో చాలా మంది ప్రజలు సందర్శించాలనుకునే ప్రాంతం కాశ్మీర్. అక్కడి అందమైన లోయలు, మంచు పర్వతాలు, ఎత్తయిన చెట్లు, వాాతావరణం ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ప్రర్యాటకులకు స్వర్గధామంగా పిలిచే కాశ్మీర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. సినిమాల్లో కనిపించే సుందర కాశ్మీరాన్ని నిజంగా చూడాలనుకునేవాళ్లకు ఐఆర్ సీటీసీ మంచి అవకాశం కల్పించింది. కొత్తగా ఆరు రోజుల టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి ప్యారడైజ్ ఆన్ ఎర్త్ – కశ్మీర్ ఎక్స్ బెంగళూరు అనే పేరు పెట్టింది. బెంగళూరు నుంచి కశ్మీర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన ఏర్పాట్లు చేసింది. చక్కగా విమానంలో వెళ్లి కాశ్మీర్ అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్యాకేజీ ధర, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

ఎయిర్ టూర్ ప్యాకేజీ..

భారతీయ రైల్వేకి అనుబంధ సంస్థ అయిన ఐఆర్ సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ మతపరమైన, పర్యాటక ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తుంది. తక్కువ ధరకే ఆయా ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. వీటితో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటక ప్రదేశాలకు ఎయిర్ టూర్ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది. అంటే విమానంలో ఆయా ప్రాంతాలను చూసి వచ్చే వీలుంటుంది. దీనిలో భాగంగా ఇటీవల కాశ్మీర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భూమిపై స్వర్గంగా పిలిచే కాశ్మీర్ అందాలను సెప్టెంబర్‌లో చూడాలనుకునే వారికి ఐఆర్ సీటీసీ అందించే ఈ ప్యాకేజీ చాలా ఉపయోగంగా ఉంటుంది.

ప్యారడైజ్ ఆన్ ఎర్త్..

ప్యారడైజ్ ఆన్ ఎర్త్- కాశ్మీర్ ఎక్స్ బెంగళూరు అని పేరుతో ప్రవేశపెట్టిన ఈ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది 5 రాత్రులు, 6 రోజుల పర్యటన. ప్యాకేజీలో భాగంగా బెంగళూరు నుంచి కాశ్మీర్ వరకు రౌండ్-ట్రిప్ విమాన ఏర్పాట్లు చేశారు. శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్‌మార్గ్ తదితర అందమైన ప్రదేశాలను చూడవచ్చు. అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్లో వసతి, ప్రయాణానికి క్యాబ్ సేవలతో పాటు ప్రయాణ బీమా కూడా ప్యాకేజీలో ఉన్నాయి.

ప్యాకేజీ వివరాలు..

  • ప్యాకేజీ పేరు: పారడైజ్ ఆన్ ఎర్త్-కశ్మీర్ ఎక్స్ బెంగళూరు (ఎస్బీఐ15)
  • ప్రదేశాలు: శ్రీనగర్, పహల్గాం, గుల్మార్గ్, సోన్‌మార్గ్
  • పర్యటన వ్యవధి: 5 రాత్రులు, 6 రోజులు
  • పర్యటన తేదీ: సెప్టెంబర్ 17
  • ట్రావెల్ మోడ్: ఫ్లైట్
  • ఖర్చులు: ఈ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ. 46,850 నుంచి మొదలవుతుంది. ప్రారంభమవుతుంది. మీరు ఒంటరిగా ప్రయాణించాలనుకుంటే రూ. 59,700 ఖర్చువుతుంది. అయితే ఇద్దరు వ్యక్తులు కలిసి ప్లాన్ చేసుకుంటే ఒక్కక్కరికీ రూ. 47,900 మాత్రమే పడుతుంది.

బుక్కింగ్ చేసుకునే విధానం..

కాశ్మీర్ ను చూడాలనే ఆసక్తి కల పర్యాటకులు చాలా సులువుగా ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ముందుగా  ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ని సందర్శించాలి. దానిలోని ’బుక్ నౌ’ ఎంపికపై క్లిక్ చేయాలి. వెంటనే ప్యాకేజీ వివరాలు కనిపిస్తాయి. మరింత సమాచారం కోసం 90031 40699, 85959 31291 నంబర్లను సంప్రదించవచ్చు.

ప్యాకేజీలో అందించే వసతులు..

  • ఎకానమీ క్లాస్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా విమాన టిక్కెట్లు (బెంగళూరు-అమృతసర్-శ్రీనగర్-అమృతసర్-బెంగళూరు).
  • శ్రీనగర్‌లోని ఒక హోటల్‌లో 3 రాత్రుల బస ఉంటుంది.
  • పహల్గామ్‌లోని ఒక హోటల్‌లో రాత్రి బస.
  • శ్రీనగర్‌లోని ఒక హోటల్‌లో 1 రాత్రి బస.
  • పర్యాటకులు సంఖ్యకు అనుగుణంగా షేరింగ్
  • టూర్ ప్రయాణం ప్రకారం బదిలీలు
  • సందర్శనల కోసం వాహనం.
  • షికారా రైడ్.
  • 5 సార్లు అల్పాహారం, రాత్రి భోజనం
  • ఐఆర్ సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు
  • ప్రయాణ బీమా

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా