Curry Leaves: కరివేపాకు వలన అనేక ఆరోగ్యలాభాలున్నాయి.. అయితే ఎలా తీసుకోవాలంటే
భారతీయ వంటకాల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకుని ఆహారానికి అదనపు రుచి, వాసన అందించేందుకు ఉపయోగిస్తారు. సూప్‌లు, కూరలు, చట్నీలు వంటి అనేక రకాల ఆహార పదార్దాల్లో ఉపయోగిస్తారు. అయితే చాలా మంది కరివేపాకుని తినకుండా పడేస్తారు. అందుకనే ఎవరైనా తమకు గౌరవం తక్కువ అయితే ఉప్మాలో కరివేపాకులా తీసి పడేశారు అని వాపోతూ ఉంటారు. కానీ కరివేపాకు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.