- Telugu News Photo Gallery How to remove oil stains from walls and tiles, Check Here is Details in Telugu
Kitchen Hacks: కిచెన్‌లో గోడ, టైల్స్‌పై పడ్డ నూనె మరకలను ఎలా పోగొట్టాలంటే..
సాధారణంగా వంటింట్లో వంట చేసేటప్పుడు మరకలు అవుతూ ఉండటం కామన్. టైల్స్, గోడలపై మరకలు పడి మురికిగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కుదరదు. అప్పుడప్పుడూ క్లీన్ చేసినా జిడ్డుగా మారి.. మురికి అస్సలు పోదు. దీని వల్ల గోడలు, టైల్స్ చాలా మురికిగా పాత వాటిలా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే.. మురికి పోయి కొత్త వాటిలా మెరుస్తాయి. మొండి మరకలను వదిలించడంలో లిక్విడ్ డిష్ వాష్ ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా..
Updated on: Sep 06, 2024 | 7:35 PM

సాధారణంగా వంటింట్లో వంట చేసేటప్పుడు మరకలు అవుతూ ఉండటం కామన్. టైల్స్, గోడలపై మరకలు పడి మురికిగా ఉంటాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి కుదరదు. అప్పుడప్పుడూ క్లీన్ చేసినా జిడ్డుగా మారి.. మురికి అస్సలు పోదు. దీని వల్ల గోడలు, టైల్స్ చాలా మురికిగా పాత వాటిలా ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలు పాటిస్తే.. మురికి పోయి కొత్త వాటిలా మెరుస్తాయి.

మొండి మరకలను వదిలించడంలో లిక్విడ్ డిష్ వాష్ ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా లిక్విడ్ డిష్ వాష్ వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని కిచెన్ టైల్స్, గోడలపై అప్లై చేసి ఓ ఐదు నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత స్క్రబ్ చేస్తే జిడ్డు పోతుంది.

మొండి మరకలను తొలగించడంలో నిమ్మరసం ఎంతో చక్కగా పని చేస్తుంది. కొద్దిగా నీటిలో నిమ్మరసం, కొద్దిగా సర్ఫ్ కలిపి టైల్స్, గోడలపై చల్లి స్క్రబ్ చేయండి. ఇలా చేయడం వల్ల మురికి వదిలి కొత్తవాటిలా మెరుస్తాయి.

వెనిగర్ కూడా జిడ్డు మరకలను వదిలించడంలో హెల్ప్ చేస్తుంది. కిచెన్ టైల్స్ పై పడ్డ మరకలను పోగొట్టడం వెనిగర్ బాగా పని చేస్తుంది. కొద్దిగా గోరు వెచ్చని నీటిలో వెనిగర్ మిక్స్ చేసి.. మరకలపై చల్లాలి. ఓ రెండు నిమిషాల తర్వాత స్క్రబ్ చేస్తే సరిపోతుంది.

బేకింగ్ సోడాతో కూడా టైల్స్‌పై పడ్డ మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు. చిన్న పాత్రలో వేడి నీళ్లు తీసుకోండి. అందులో బేకింగ్ సోడా మిక్స్ చేసి.. మొండి మరకలు ఉన్న చోట నీళ్లు వేస్తూ స్క్రైబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మరకలు పోయి.. కొత్త వాటిలా ఉంటాయి.




