AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brinjal: వంకాయలతో మీకు తెలీని రహస్యాలు.. డయాబెటీస్, క్యాన్సర్‌కు చెక్..

కూరగాయల్లో రాజు ఎవరు అంటే.. 'వంకాయ' అనే చెప్పాలి. సరిగ్గా వండాలే కానీ వంకాయలతో వచ్చే రుచి మరే ఇతర కూరగాయలతో కూడా రాదు. అంత చక్కగా ఉంటుంది కర్రీ. వంకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వంకాయలతో ఎన్నో రకాల స్నాక్ కూడా తయారు చేస్తూ ఉంటారు. వారంలో ఒక్కసారైనా వంకాయ తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం దురద సమస్య వస్తుందని మాత్రమే తినరు. కానీ వీటితో చాలా రకాల దీర్ఘకాలిక..

Brinjal: వంకాయలతో మీకు తెలీని రహస్యాలు.. డయాబెటీస్, క్యాన్సర్‌కు చెక్..
Eggplant 1
Chinni Enni
|

Updated on: Sep 05, 2024 | 5:08 PM

Share

కూరగాయల్లో రాజు ఎవరు అంటే.. ‘వంకాయ’ అనే చెప్పాలి. సరిగ్గా వండాలే కానీ వంకాయలతో వచ్చే రుచి మరే ఇతర కూరగాయలతో కూడా రాదు. అంత చక్కగా ఉంటుంది కర్రీ. వంకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వంకాయలతో ఎన్నో రకాల స్నాక్ కూడా తయారు చేస్తూ ఉంటారు. వారంలో ఒక్కసారైనా వంకాయ తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఉండే గుణాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం దురద సమస్య వస్తుందని మాత్రమే తినరు. కానీ వీటితో చాలా రకాల దీర్ఘకాలిక, సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. వంకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం:

వంకాయల్లో ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణగా నిలుస్తాయి. రక్తం పోటుతో పాటు కొలెస్ట్రాల్ స్థాయులను కూడా తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా ఇతర గుండె జబ్బులు రాకుండా కీలక పాత్ర పోషిస్తుంది.

క్యాన్సర్ సమస్యకు చెక్:

వంకాయలు తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ కంట్రోల్:

వంకాయలు తినడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. ఇందులో ఫైబర్ శాతం అనేది మెండుగా లభిస్తుంది. కాబట్టి త్వరగా రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి.

వెయిట్ లాస్:

వంకాయల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

చర్మ ఆరోగ్యం:

వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని అన్ని సమస్యల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యంగ్‌గా, యవ్వనంగా ఉంచడంలో సహాయ పడుతుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం:

వంకాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!