AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ప్రిడ్జ్‌లో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు.. ఆరోగ్యానికి హానికరం..

కూరగాయలు, పండ్లు, పువ్వులు, కోడి గుడ్లు, పాలు, పెరుగు ఇలా రకరకాల వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇలా కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఆరోగ్యానికి హానికరం. అన్ని రకాల వస్తువులను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం మంచిది. ఇలా రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు వాటి నాణ్యతను కోల్పోయే అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచవద్దు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Kitchen Hacks: ప్రిడ్జ్‌లో పొరపాటున కూడా ఈ వస్తువులు పెట్టొద్దు.. ఆరోగ్యానికి హానికరం..
Kitchen Hacks 1
Surya Kala
|

Updated on: Sep 05, 2024 | 4:48 PM

Share

ప్రస్తుతం బిజీ బిజీ లైఫ్.. దీంతో రోజూ మార్కెట్‌కి వెళ్లడం కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. కనుక చాలా మంది అవసరమైన దానికంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తారు. దీంతో ఇప్పుడు ఫ్రిజ్ లేకుండా ఒక్క క్షణం కూడా రోజు జరుగుతుందా అనే పరిస్థితి నెలకొంది. ఫ్రిడ్జ్ రోజు వారీ జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. దీనిలో కూరగాయలు, పండ్లు, పువ్వులు, కోడి గుడ్లు, పాలు, పెరుగు ఇలా రకరకాల వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఇలా కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఆరోగ్యానికి హానికరం. అన్ని రకాల వస్తువులను ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం మంచిది. ఇలా రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పుడు వాటి నాణ్యతను కోల్పోయే అనేక ఆహారాలు ఉన్నాయి. వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో ఉంచవద్దు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

బ్రెడ్: చాలా మంది బ్రెడ్‌ని ప్యాకెట్లలో ఫ్రిజ్‌లో ఉంచుతారు. రిఫ్రిజిరేటర్ ఆహారం నుండి ఈ బ్రెడ్ అదనపు నీటిని గ్రహిస్తుంది. కనుక బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది పొడిగా మారుతుంది. కేకుల విషయంలో కూడా అదే జరుగుతుంది.

బంగాళదుంపలు: పచ్చి బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచవద్దు. బంగాళదుంపలను ఎప్పుడూ వంటగది బుట్టలో ఉంచండి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ వంటిది అధికంగా ఉన్నాయి. కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే చక్కెర శాతం పెరుగుతుంది. అంటే బంగాళాదుంప రుచి తియ్యగా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

మసాలా దినుసులు: చాలా మంది దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు వంటి మసాలా దినుసులను ఫ్రిజ్‌లో ఉంచుతారు. అదే విధంగా తులసి దళాలు, రోజ్మేరీ, పుదీనా ఆకులను ప్యాకెట్లలో చుట్టి ఫ్రిజ్ లో పెడతారు. అయితే ఇలా చేయడం వలన త్వరగా కుళ్ళిపోతాయి. అయితే వీటిని గాజు సీసాల్లో పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. అయితే, సూర్యు రశ్మికి దూరంగా ఉంచండి.

తేనె: స్వచ్ఛమైన తేనె ఏళ్ల తరబడి నిల్వ ఉంటుంది. తేనెను ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం లేదు. వంటగదిలో తేనె పెట్టవద్దు. చాలా వేడి వాతావరణంలో తేనెను నిల్వ చేసుకోవాలంటే నీటితో నిండిన గిన్నెలో తేనె బాటిల్ ని ఉంచవచ్చు.

వెల్లుల్లి: బంగాళదుంపల మాదిరిగా, వంటగది బుట్టలో వెల్లుల్లి ఉంచండి. వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచితే దాని రుచి, వాసన రెండూ పోతాయి. చాలా మంది ఒలిచిన వెల్లుల్లిని రిఫ్రిజిరేటర్‌లో కూడా నిల్వ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎయిర్ టైట్ కంటైనర్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయినప్పటికీ అసలు వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచకపోవడమే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.