Vinayaka Chavithi: మట్టి గణపయ్యని స్పూన్లతో సింపుల్‌గా ఇలా తయారు చేయండి.. అందంమైన విగ్రహం రెడీ..

వినాయక చవితి పండగలో వినాయక విగ్రహం, పత్రీ, పువ్వులు వంటి వాటికి విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా వీటిని పూజ కోసం సేకరిస్తారు. అంతేకాదు చిన్నారులతో మట్టి వినాయకుడి విగ్రహాన్ని చేయించి పూజలో పెట్టుకుంటే వారి ఆనందం బహుశా వర్ణింప లేనిది. ఈ నేపధ్యంలో చిన్నారులతో ఈజీ గణపయ్య విగ్రహాన్ని తయారు చేయించాలనుకుంటే.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి.

Vinayaka Chavithi: మట్టి గణపయ్యని స్పూన్లతో సింపుల్‌గా ఇలా తయారు చేయండి.. అందంమైన విగ్రహం రెడీ..
Lord Ganapati Idol
Follow us
Surya Kala

|

Updated on: Sep 05, 2024 | 4:29 PM

పిల్లలకు వినాయక చవితి పండగ అంటే అమితమైన ఇష్టం. చదువుని, జ్ఞానాన్ని ఇచ్చే గణపయ్యను పూజించడం వలన స్టూడెంట్స్ కు శుభం కలుగుతుందని విశ్వాసం. అందుకనే వినాయక చవితి పూజలో స్టూడెంట్స్ తమ పుస్తకాలు, పెన్సిల్స్ పెన్నులు వంటి వాటిని స్వామి వారి పూజా సమయంలో పెట్టుకుంటే.. చేతి వృత్తి కళాకారులూ తమ తమ పనిముట్లను పూజ సమయంలో పెట్టుకుంటారు. స్వామివారి దయతో తమకు అన్ని శుభాలే కలుగుతాయని విశ్వాసం. ఇక వినాయక చవితి పండగలో వినాయక విగ్రహం, పత్రీ, పువ్వులు వంటి వాటికి విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా వీటిని పూజ కోసం సేకరిస్తారు. అంతేకాదు చిన్నారులతో మట్టి వినాయకుడి విగ్రహాన్ని చేయించి పూజలో పెట్టుకుంటే వారి ఆనందం బహుశా వర్ణింప లేనిది. ఈ నేపధ్యంలో చిన్నారులతో ఈజీ గణపయ్య విగ్రహాన్ని తయారు చేయించాలనుకుంటే.. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్ వేయండి.

వైరల్ అవుతున్న వీడియోలో అందమైన మట్టి వినాయక విగ్రహ తయారీ కోసం కేవలం మట్టి, రెండు మూడు రకాల స్పూన్లను మాత్రమే ఉపయోగించారు. ముందుగా ఒక చిన్న స్టీల్ ప్లేట్ ను తీసుకుని అందులో మట్టి అంటుకోకుండా కొంచెం నీరుని అప్లై చేశారు. అనంతరం మెత్తని మట్టిని తీసుకుని ప్లేట్ నిండుగా పెట్టి.. దానిని చదును చేసి వినాయకుడి కోసం పీటాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఒక స్పూన్ తీసుకుని మట్టిని పెట్టి కాళ్ళు చేతులు, చెవులు ఇలా అన్ని శరీర భాగాలను వివిధ రకాల సైజ్ స్పూన్లతో తయారు చేసి అందంగా వినాయకుడిగా మలిచారు. ప్రస్తుతం ఈ వీడియో చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా ఉందని అంటున్నారు. ఈ విగ్రహం తయారీ విధానంతో చిన్నారులు సైతం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..