Vinayaka Chavithi 2024: ఇక్కడ గణపయ్యకు పూజ చేయడం ఓ సాహసం.. కొండ కోనల్లో ప్రశాంతంగా పూజలను అందుకుంటున్న గణపయ్య ఎక్కడంటే
బొజ్జ గణపయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే కొండ కోనల్లో ఆరుబయట అది కూడా ఎత్తైన పర్వతం మీద ఏకాంతంగా పూజలను అందుకునే వినాయకుడి గురించి మీకు తెలుసా.. ! అది కూడా మన దేశంలోనే.. అవును కొండల మధ్యలో 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న రాతిపై ఒక చిన్న స్థలంలో కొలువ దీరిన వినాయకుడి విగ్రహం గురించి తెలుసా..!
వినాయకుడు అంటే పురాతన ఆలయాలు.. పవిత్ర క్షేత్రాలు గుర్తుకొస్తాయి. ఇక వినాయక చవితి సందర్భంగా మండపాలలో కొలువు దీరి పూజలను అందుకునే బొజ్జ గణపయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే కొండ కోనల్లో ఆరుబయట అది కూడా ఎత్తైన పర్వతం మీద ఏకాంతంగా పూజలను అందుకునే వినాయకుడి గురించి మీకు తెలుసా.. ! అది కూడా మన దేశంలోనే.. అవును కొండల మధ్యలో 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న రాతిపై ఒక చిన్న స్థలంలో కొలువ దీరిన వినాయకుడి విగ్రహం గురించి తెలుసా..!
ఈ గణేశ విగ్రహం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలోని బైలాడిలాలోని ధోల్కల్ కొండపై ఉంది. పురాణాల ప్రకారం ఈ కొండపైనే గణేశుడు, పరశురాముడి మధ్య యుద్ధం జరిగినట్లు చెబుతారు. అలాగే ఈ యుద్ధంలో పరశురాముడి గొడ్డలి వినాయకుడి దంతనికి తగిలి ఒకటి విరిగింది. అందుకే కొండ కింద ఉన్న గ్రామానికి ఫరస్పాల్ అని పేరు పెట్టారు. చిందక నాగవంశీ రాజులు కొండపై గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించారని.. ఈ సంఘటన విశ్వం అంతం వరకు గుర్తుండిపోయేలా చేశారని పేర్కొన్నారు. ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు.
View this post on Instagram
6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పు గల గ్రానైట్ రాయితో చేసిన ఈ విగ్రహం చాలా కళాత్మకంగా ఉంటుంది. ఈ గణేశ విగ్రహం కుడిచేతి పై భాగంలో కొడవలి, ఎగువ ఎడమచేతిలో విరిగిన దంతం, దిగువ కుడిచేతిలో అభయ ముద్రలో హారం, దిగువ ఎడమచేతిలో మోదకంతో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. స్థానిక గిరిజనులు ఏకదంతాన్ని తమ రక్షకుడిగా పూజిస్తారు. గిరిజనులు చెప్పిన ప్రకారం ధోల్కల్ శిఖరం సమీపంలోని రెండవ శిఖరంపై పార్వతి దేవి, సూర్యభగవానుడి విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. ఇది సుమారు 15 ఏళ్ల క్రితం చోరీకి గురైంది. ఇప్పటి వరకు చోరీకి గురైన విగ్రహం గురించి ఎలాంటి సమాచారం లేదు. కొండపైకి వెళ్లే దారిలో వన్యప్రాణుల భయం ఉన్నా.. దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది ఆదివాసీల విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..