Vinayaka Chavithi 2024: వినాయక చవితి మండప అలంకరణలో ఈ 4 వస్తువులు ఉపయోగించండి.. అందానికి అందం.. శుభప్రదం
వినాయక చవితి రోజున గణపతి బప్పా మోరియా...మంగళ మూర్తి మోరియా కీర్తనలు ప్రతిచోటా వినిపిస్తాయి. గణపతి మండపాలను వీలైనంత అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించాలని కోరుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. మండపాల అలంకరణలో ఏయే వస్తువులు ఉపయోగించాలో తెలుసుకుందాం.
వినాయక చవితి రోజు నుండి ప్రారంభమయ్యే గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు భక్తులతో పూజలను అందుకునే గణపయ్య పదవ రోజు నిమజ్జనంతో ముగుస్తుంది. ఈ సమయంలో దేశం మొత్తంలో విపరీతమైన ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. గణపతి మండపాలను వివిధ రకాలుగా అలంకరిస్తారు. అదే సమయంలో భక్తులు తమ ఇంట్లో కూడా వినాయకుడిని ప్రతిష్టిస్తారు. ఈ సమయంలో ప్రతిచోటా అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా ప్రజలు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో ఎంతో ఉత్సాహంతో అలంకరిస్తారు. మండపాలను అలంకరించేందుకు లైట్ల నుండి పువ్వుల వరకు ప్రతిదీ ఉపయోగిస్తారు. మీరు మీ ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టించినున్నట్లు అయితే లేదా మండపాలను అలంకరిస్తున్నట్లయితే.. వినాయక విగ్రహం ప్రతిష్టించే మండప అలంకరణలో రంగులు, వస్తువుల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
వినాయక చవితి రోజున గణపతి బప్పా మోరియా…మంగళ మూర్తి మోరియా కీర్తనలు ప్రతిచోటా వినిపిస్తాయి. గణపతి మండపాలను వీలైనంత అందంగా అలంకరించి అందులో ప్రతిష్టించాలని కోరుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోనున్నారు. మండపాల అలంకరణలో ఏయే వస్తువులు ఉపయోగించాలో తెలుసుకుందాం.
పసుపు లేదా ఎరుపు బట్టలు ఉపయోగించండి
గణపతి విగ్రహ మండపాలను అలంకరించేటప్పుడు.. పీటంపై పసుపు రంగు వస్త్రం లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి. ఆస్థానంలో అలంకరణ కోసం పసుపు రంగు వివిధ వస్తువులను కూడా ఉపయోగించండి. ఎందుకంటే ఈ రంగు గణపతి ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది.
అరటి ఆకులతో అలంకరించండి
వినాయకుని పూజా మండపాన్ని అలంకరించడానికి అరటి ఆకులను ఉపయోగించండి. ఇది పచ్చదనంతో అందంగా కనిపించడమే కాదు పూజలో కూడా అరటి ఆకులను ఉపయోగించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గణపతి బప్పాకు నైవేద్యం పెట్టడానికి ప్లేట్‌కు బదులుగా అరటి ఆకులను ఉపయోగించడం మంచిదని భావిస్తారు.
అలంకరణలో ఈ పువ్వులను ఉపయోగించండి
వినాయకుని ఆస్థాన అలంకరణలో పారిజాతం, పసుపు బంతిపూలు, మందార పువ్వులను ఉపయోగించండి. పారిజాతం పువ్వులు తెలుపు నారింజ కలయికతో చాలా అందంగా కనిపిస్తాయి. మందార, బంతి పువ్వులు కూడా వినాయక విగ్రహ మండపానికి అందాన్ని ఇస్తాయి. ఈ పూలన్నీ కూడా గణపతికి ఇష్టమైనవిగా భావిస్తారు.
దర్భ గడ్డిని ఉపయోగించండి
దర్భ గడ్డిని గణపతికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆయన పూజలో కూడా దీనిని ఉపయోగిస్తారు. గణేశుని ఆలయ అలంకరణలో పూలతో పాటు హరిత స్పర్శను ఇవ్వడానికి దర్భ గడ్డిని ఉపయోగించడం అత్యంత శ్రేష్టం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి