AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: ఆ దేశంలో అగ్ని పర్వతం బద్దలవ్వకుండా గణపతి కావాలా.. 700 ఏళ్ల చరిత్ర గల వినాయకుడు ఎక్కడంటే

కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవి మహిమానిత్వమైనవిగా ఖ్యతిగాంచాయి. భక్తులతో పూజలను అందుకుంటున్నాడు విఘ్నాలకదిపతి వినాయకుడు. అయితే ఒక ప్రాంతలో అగ్నిపర్వతం ముఖ ద్వారం వద్ద వినాయకుడు కావాలాగా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి పూజలు చేయకుండా కోపంతో అగ్ని పర్వతం బద్దలై తాము నశించి పోతామని అక్కడ నివసించే ప్రజల నమ్మకం. అయితే ఈ విగ్రహం మన దేశంలో కాదు..ఇండోనేషియాలో ఉంది.

Vinayaka Chavithi: ఆ దేశంలో అగ్ని పర్వతం బద్దలవ్వకుండా గణపతి కావాలా.. 700 ఏళ్ల చరిత్ర గల వినాయకుడు ఎక్కడంటే
Ganesha Mount Bromo
Surya Kala
|

Updated on: Sep 05, 2024 | 5:54 PM

Share

మన దేశంలో మాత్రమే కాదు నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, నెదర్లాండ్స్, జపాన్ వంటి అనేక దేశాల్లో వినాయకుడి విగ్రహాలు, గణపతి ఆలయాలున్నయన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని ఆలయాలు అతి పురాతనమైనవి మహిమానిత్వమైనవిగా ఖ్యతిగాంచాయి. భక్తులతో పూజలను అందుకుంటున్నాడు విఘ్నాలకదిపతి వినాయకుడు. అయితే ఒక ప్రాంతలో అగ్నిపర్వతం ముఖ ద్వారం వద్ద వినాయకుడు కావాలాగా ఉన్నాడు. ఇక్కడ వినాయకుడికి పూజలు చేయకుండా కోపంతో అగ్ని పర్వతం బద్దలై తాము నశించి పోతామని అక్కడ నివసించే ప్రజల నమ్మకం. అయితే ఈ విగ్రహం మన దేశంలో కాదు..ఇండోనేషియాలో ఉంది.

అవును ఇండోనేషియాలోని మౌంట్ బ్రోమోలో 700 సంవత్సరాల పురాతన గణేశ విగ్రహం ఉంది. అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి నిరంతరం తమని గణేశుడు రక్షిస్తున్నాడని స్థానిక ప్రజల నమ్మకం. తాజా రికార్డుల ప్రకారం ఇండోనేషియాలోని 141 అగ్నిపర్వతాలున్నాయి. వాటిల్లో 130 అగ్ని పర్వతాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. ఇలా చురుకుగా ఉన్న అగ్ని పర్వతాల్లో ఒకటి మౌంట్ బ్రోమో. ఇది తూర్పు జావా ప్రావిన్స్‌లోని బ్రోమో టెంగర్ సెమెరు జాతీయ ఉద్యానవనంలో ఉంది. ఇండోనేషియాకి చెందిన క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ బ్రోమోపై గణపతి విగ్రహం ఉంది. అక్కడ స్థానికుల చెప్పిన ప్రకారం ఈ విగ్రహం 700 సంవత్సరాలుగా అక్కడ ఉంది.

అయితే ‘బ్రోమో’ అనే పదం హిందూ దేవతలలో సృష్టి కర్త అయిన బ్రహ్మకి చెందిన పేరు జావానీస్ ఉచ్చారణ నుండి ఉద్భవించింది. 2012 వరకు ఉన్న రికార్డుల ప్రకారం ఇండోనేషియా మొత్తం ప్రాంతంలో వందకు పైగా చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. దీంతో దాదాపు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతంపై కనిపించే గణేశ విగ్రహానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ చురుకైన అగ్నిపర్వతం బద్దలు కాకుండా గణేశుడు తమను రక్షిస్తాడని స్థానికులు నమ్ముతారు. టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన ఇతిహాసాల ప్రకారం సుమారు 700 సంవత్సరాల క్రితం టెంగర్ మాసిఫ్ తెగకు చెందిన పూర్వీకులు ఈ పర్వతం మీద గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారని దృఢంగా నమ్ముతారు. దీని కారణంగా వీరు వినాయకుడికి పూజలు చేసి అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. గణపతి పూజ ఎటువంటి సందర్భంలోనూ ఆపకూడదు అనేది వీరి నమ్మకం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఇక్కడ వినాయకుడిని పూజించడమే కాకుండా పూలు, పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. అలా చేయకుంటే అగ్నిపర్వతం బద్దలై తమని అగ్ని పర్వతం తినేస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి